అందుకే చంద్రబాబును కాల్చాలని జగన్ అన్నారు: లక్ష్మీపార్వతి

నంద్యాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి సమర్థించారు.

హైదరాబాద్: నంద్యాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి సమర్థించారు.

జగన్ అన్నదాంట్లో తప్పేమీ లేదన్నారు. జగన్‌లో ఎన్టీఆర్ ప్రవేశి ఆ మాట చెప్పించి ఉంటారని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తండ్రిలాంటి మామను చంపిన చరిత్ర చంద్రబాబుది అన్నారు.

 Laxmi Parvathi supports YS Jagan comments

ఎన్నో హత్యల్లో చంద్రబాబుకు పరోక్ష ప్రమేయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు. హత్యా రాజకీయాలపై టిడిపి నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని లక్ష్మీపార్వతి సూచించారు. నంద్యాల ప్రజల ఆవేదననే జగన్ చెప్పారని ఆమె తెలిపారు.

2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాకు చంద్రబాబు 12 హామీలు ఇచ్చారని లక్ష్మీపార్వతి అన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీని నెరవేర్చలేదని ఆమె చెప్పారు. చంద్రబాబు మోసపూరిత మాటలే జగన్‌ను కదిలించాయని, చంద్రబాబును ఏం చేసినా తప్పు లేదని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+