ప్యాకేజీ చెప్పని మోడీ: బాబు పక్కనే.., ఏపీ ప్రజలకు కెసిఆర్ అభివాదం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేడుక ప్రారంభమైంది. నటుడు సాయి కుమార్, గాయని సునీతలు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులకు పాదాభివందనం అన్నారు.
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోడీ. ప్రధానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య ఘన స్వాగతం పలికారు. తెల్ల కుర్తా, పైజామాతో వచ్చారు. హెలికాప్టర్‌లో అమరావతి శంకుస్థాపనకు బయలుదేరనున్నారు.
Photos: అమరావతి శంకుస్థాపన
- ప్రధాని మోడీ ఏపీకి వరాలిస్తారని చాలామంది భావించారు. అయితే, ప్యాకేజీ ప్రకటించలేదు. ప్రత్యేక హోదా నుంచి మొదటి నుంచే ఆశలు లేవు. అయితే, విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతామని మాత్రం చెప్పారు.
- అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ, ముఖ్య అతిథులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రత్యేక జ్ఞాపికలు అందజేశారు. అనంతరం అతిథులు సభికులకు అభివాదం చేశారు. ప్రధాని మోడీ తిరుపతి పర్యటనకు బయల్దేరి వెళ్లారు.
- కాగా, కెసిఆర్‌కు చంద్రబాబు పుష్పగుచ్ఛం ఇచ్చినప్పుడు.. ప్రజలు హర్షధ్వనాలు చేశారు. పుష్పగుచ్ఛం అందుకున్న కెసిఆర్ ప్రజలకు అభివాదం చేశారు.

- ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ, తెలంగాణ సిఎం కెసిఆర్ తదితరులకు అమరావతి జ్ఞాపికలు అందించారు.
- ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సిఎం కెసిఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించాడని తెలిసి తాను సంతోషించానని చెప్పారు. ప్రజా రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని చెప్పారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆంధ్రా - తెలంగాణ వేరయినా తెలుగు వారి ఆత్మ ఒక్కటే అన్నారు. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తామన్నారు. అమరావతికి ఘన చరిత్ర ఉందన్నారు.
- చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నేను, కెసిఆర్ కలిసి నడుస్తామన్నారు.
- ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతికి కేంద్రం సహకరిస్తుందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం అన్నారు.

- అమరావతి విరాజిల్లాలని, తెలంగాణ నుంచి సాయం చేస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ చెప్పారు.
- వెంకయ్య మాట్లాడుతూ... ఇరువురు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక పైకి రావడం సంతోషమన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటామన్నారు.
- అమరావతి రాజధానికి సహకరిస్తామని జపాన్ మంత్రి తకాచీ చెప్పారు. అమరావతి నిర్మాణానాన్ని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్వాగతించారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.

- శంకుస్థాపన అనంతరం జపాన్, సింగపూర్ మంత్రులు, తెలంగాణ సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి వెంకయ్యలు మాట్లాడారు.
- కెసిఆర్‌కు చంద్రబాబు పుష్పగుచ్ఛం ఇస్తున్న సమయంలో ప్రజలు హర్ధధ్వనాలు చేశారు.
- ప్రధాని మోడీ పార్లమెంటు నుంచి తెచ్చిన మట్టి, యమునా నది నుంచి తెచ్చిన మట్టి నీటిని ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు.
- అనంతరం తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారు.

- ప్రధాని మోడీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య తదితరులకు చంద్రబాబు పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. వేదిక పైన కెసిఆర్‌కు చంద్రబాబు పుష్పగుచ్ఛం ఇచ్చిన సమయంలో ఇరువురు కలిసి మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు.
- శంకుస్థాపనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ఆసక్తిగా తిలకించారు. ఆయా ఫొటోలకు సంబంధించిన వివరాలు, విశేషాలను ప్రధానికి వివరించేందుకు ఏపీ ట్రాక్స్ కో సీఎండీ అజయ్ జైన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అజయ్ జైన్ వివరిస్తున్న అంశాలను ప్రధాని మోడీ ఆసక్తిగా విన్నారు.
- అమరావతి శంకుస్థాపనలో కీలక ఘట్టమైన యంత్రన్యాసం చేశారు. నిర్దేశిత సమయం మధ్యాహ్నం 12:37 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నవధాన్యాలతో యంత్రన్యాసాన్ని పూర్తి చేశారు. ఫొటో గ్యాలరీ సందర్శన అనంతరం నేరుగా యాగశాలకు చేరుకున్న మోడీ, పూజారులు చెప్పిన విధంగా యంత్ర ప్రతిష్ఠ చేశారు.
PM Narendra Modi participates in the rituals for foundation laying of the new capital of Andhra Pradesh, Amaravati. pic.twitter.com/LpoVGgiGPZ
— ANI (@ANI_news) October 22, 2015 - ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అనంతరం.. సాయి కుమార్... ప్రజా రాజధానికి స్వాగతం అన్నారు.
- ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తున్న సమయంలో... ఆయన పక్కన సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, గవర్నర్ నరసింహన్, నిర్మలా సీతారామన్ తదితరులు ఉన్నారు.
- ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి గ్యాలరీని సందర్శించిన అనంతరం రాజధానికి శంకుస్థాపన చేశారు.
- పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రధాని మోడీ అమరావతి శంకుస్థపన వేదికకు చేరుకున్నారు. ప్రధాని మోడీ శంకుస్థాపన వేదిక వద్ద నారా లోకేష్ బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్‌ను ముద్దు చేశారు. అనంతరం మోడీ గ్యాలరీ వీక్షించారు.
- పన్నెండు గంటల పది నిమిషాలకు రింగ్ డ్యాన్స్ ప్రారంభమైంది. ప్రముఖ సంగీత వాయిద్యకారుడు శివమణి ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. డ్రమ్స్‌తో లయబద్ధంగా వాయిస్తూ శివమణి చేసిన సంగీత ప్రదర్శన అతిథులను అలరించింది.

- అమరావతిలో పరిశ్రమల, పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం జపాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం ఉదయం విజయవాడలోని హోటల్ తాజ్ గేట్‌వేలో ఎమ్‌ఓయూ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ దేశ ఆర్ధిక, వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి ఇశోకె టకాజీతో చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు.
- అతిథులకు ఆహార ప్యాకెట్లు అందిస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరికీ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
- అమరావతి కోసం సర్వమత ప్రార్థనలు చేశారు.
- శివమణి తన డ్రమ్స్‌తో అలరించారు.
- జనంతో ప్రజలకు కేటాయించిన ఎనిమిది బ్లాకులు కిక్కిరిసిపోయాయి. గన్నవరం నుంచి అమరావతికి వస్తుండగా నటుడు బాలకృష్ణను చూసేందుకు చాలామంది ఎగబడ్డారు.

- అమరావతి చేరుకున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, నారా లోకేష్
- పదకొండు గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు గన్నవరం చేరుకున్నారు. ఆయన ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ప్రజలు, ప్రముఖులు భారీగా తరలి వస్తున్నారు.
- తెలంగాణ సీఎం కెసిఆర్ సభా ప్రాంగణానికి చేరుకోగానే ఏపీ మంత్రులు స్వాగతం పలికారు.
- సభా స్థలికి కేంద్రమంత్రులు, విదేశీ అతిథులు వస్తున్నారు. ఎస్పీజీ కమెండేలు పర్యవేక్షణలో భద్రత ఉంది.
- భూములు ఇచ్చిన రైతులకు రెడ్ కార్పెట్. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- ప్రముఖులు, సామాన్యులు, వివిఐపీలు ఇలా.. వచ్చే వారుకు ప్రత్యేక రహదారులు ఏర్పాటు చేశారు. కార్లు, ద్విచక్రవాహనాలు, భారీ వాహనాలు వెళ్లేందుకు వేర్వేరు రహదారులు ఉన్నాయి. దీంతో ఎలాంటి ఎవరు ఇప్పటి వరకు ఇబ్బంది పడటం లేదు.
- తెలంగాణ సీఎం కెసిఆర్ పావు తక్కువ పదకొండు గంటలకు శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్నారు. తెలంగాణ టిడిపి యువ నేత రేవంత్ రెడ్డి కూడా వేడుకకు వచ్చారు.
- భవిరి రావి అనంతరం... సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 'రైతన్నకు వేలవేల దండాలు' అంటూ నృత్యరూపకంలో ప్రదర్శించారు.

- బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, కృష్ణ తదితరులను అనుకరిస్తూ భవిరి రవి మాట్లాడి అలరించారు. వారు అమరావతి రాజధానిని ప్రశంస్తున్నట్లు అనుకరిస్తూ మాట్లాడారు.
- అమరావతి రాజధానికి వెంకటేష్ వచ్చారు. రామోజీ రావు, బోయపాటి శ్రీను, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు వచ్చారు.
- అమరావతి శంకుస్థాపనకు పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కోసం గుజరాత్ లో ఉన్నారు.
- తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు.
- గవర్నర్ నరసింహన్ విజయవాడ చేరుకున్నారు.












Click it and Unblock the Notifications