వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌తో బాబు: కృష్ణుడిగా శంఖం పూరించి (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారత రత్న అవార్డును కేంద్రం ప్రకటించేలా కృషి చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారంనాడు ముగిసిన మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డును ప్రకటించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదించిన తీర్మానాన్ని మహానాడు ఏకగ్రీవంగా ఆమోదించారు.

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు తామే కృషి చేశామని చంద్రబాబు అన్నారు. ఆ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టామని అన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్టీఆర్ పేరు తొలగించి రాజీవ్ గాంధీ పేరు పెట్టిందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

కేంద్ర పౌరవిమానయాన శాఖ కూడా తమకే ఉందని గుర్తు చేశారు. ఇంకా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సాంబశివరావు, బి.వి. నాగేశ్వర రెడ్డి, ఎం.ఎ. షరీఫ్, సాయిబాబు, కోటేశ్వర రావు తదితరులు ప్రసంగించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను చంద్రబాబు సన్మానించారు.

అంపశయ్య నవీన్(సామాజిక విశ్లేషకులు), డాక్టర్ తిరునగిరి(కవి, విమర్శకులు), చంద్రబోస్(గీత రచయిత), మంతెన వెంకటరామరాజు(వసుధాఫౌండేషన్ చైర్మన్), డాక్టర్ రాజేంద్రప్రసాద్(సినీ హీరో), పర్వతనేని వెంకటకృష్ణ(జర్నలిస్ట్) పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ఎన్టీఆర్ పురస్కారాలు అందుకున్నారు. కీడ్రా విభగం నుంచి పుల్లెల గోపీచంద్‌కు ఎన్టీఆర్ పురస్కారం లభించింది.

నాగలితో చంద్రబాబు

నాగలితో చంద్రబాబు

రెండు రోజులపాటు జరిగిన మహానాడు బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా నాగలి ధరించి విక్టరీ సింబల్ చూపిస్తున్న చంద్రబాబు నాయుడు.

శంఖంపూరించిన చంద్రబాబు

శంఖంపూరించిన చంద్రబాబు

తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారత రత్న అవార్డును కేంద్రం ప్రకటించేలా కృషి చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబుతో ఎర్రబెల్లి

చంద్రబాబుతో ఎర్రబెల్లి

రెండు రోజులపాటు జరిగిన మహానాడు బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ముచ్చటిస్తున్న దృశ్యం.

భారీగా తరలిని టిడిపి కార్యకర్తలు

భారీగా తరలిని టిడిపి కార్యకర్తలు

ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డును ప్రకటించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదించిన తీర్మానాన్ని మహానాడు ఏకగ్రీవంగా ఆమోదించారు.

గొర్రెపిల్లతో బాబు

గొర్రెపిల్లతో బాబు

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు తామే కృషి చేశామని చంద్రబాబు అన్నారు. ఆ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టామని అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పేరును మార్చిందని అన్నారు.

ఎర్రబెల్లి-మోత్కుపల్లి

ఎర్రబెల్లి-మోత్కుపల్లి

మహానాడుకు హాజరైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు.

బాబుకు కిరీటం

బాబుకు కిరీటం

మహానాడులు కిరీటం ధరించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.

బాబు ప్రసంగం

బాబు ప్రసంగం

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను చంద్రబాబు సన్మానించారు.

నారా లోకేష్

నారా లోకేష్

పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని టిడిపి యువనేత నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

నారా లోకేష్

నారా లోకేష్

బుధవారం టిడిపి మహానాడులో తొలిసారి లోకేష్ ప్రసంగించారు. ఇతర పార్టీలకు లేని కార్యకర్తల శక్తి టిడిపికి మాత్రమే సొంతమన్నారు. కార్యకర్తలను అధినేత చంద్రబాబు సొంత బిడ్డలా చూస్తారని చెప్పారు.

ఎన్టీఆర్ వేషధారితో..

ఎన్టీఆర్ వేషధారితో..

రెండు రోజులపాటు గండిపేటలో జరిగిన మహానాడుకు హాజరైన ఎన్టీఆర్ వేషధారితో చంద్రబాబు నాయుడు.

వేదికపై చంద్రబాబు

వేదికపై చంద్రబాబు

వేలాది మంది కార్యకర్తల పిల్లలను ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో ఉచితంగా చదివిస్తున్నామని లోకేస్ వెల్లడించారు.

పార్టీ నేతలు

పార్టీ నేతలు

మహానాడు వేదికపై తెలుగుదేశం పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, మురళీ మోహన్, ఇతర నేతలు.

చంద్రబాబుతో మహిళా నేతలు

చంద్రబాబుతో మహిళా నేతలు

మహానాడు వేదికపై చంద్రబాబు నాయుడితో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు.

మైనార్టీ నేతలతో..

మైనార్టీ నేతలతో..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని మహానాడులో కలిసిన పార్టీ మైనార్టీ నాయకులు.

నారా లోకేష్

నారా లోకేష్

బుధవారం టిడిపి మహానాడులో తొలిసారి లోకేష్ ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

English summary
The Telugu Desam Party (TDP)'s two-day annual conclave mahanadu, ended on wednesday amid fanfare with the party resolving to strive for the development of both the residuary Andhra Pradesh and Telangana states which will come into being on June two.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X