వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగరాజుపై కాల్పులు: ప్రధాన షూటర్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: హైదరాబాదులోని సరూర్‌నగర్‌లో జ్యోతిష్కుడు నాగరాజుపై కాల్పులు జరిపిన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ పాశ్చా అలియాస్ సంజూను పోలీసులు అరెస్టు చేసారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం సమీపంలోని పెదఅవుటపల్లి వద్ద జరిగిన తండ్రీకొడుకుల హత్య కేసులో ప్రధాన షూటర్ కూడా అతనే. ఈ నెల 1న సరూర్‌నగర్‌లో నాగరాజుపై జరిగిన హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.
సంజూను పీటీ వారెంట్‌పై ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జైలు నుంచి తీసుకొచ్చి మంగళవారం గన్నవరం కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం 6 రోజులు రిమాండ్ విధించటంతో విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. హత్యాపథకాన్ని రచించడమే కాకుండా స్వయంగా రెండు చేతుల ద్వారా రెండు తుపాకులతో కాల్పులు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది.

అలాగే భూతం దుర్గారావు హత్య కేసులో ప్రధాన నిందితుడైన సూరపాటి నాగరాజుపై సరూర్‌నగర్‌లో జరిగిన హత్యాయత్నం సంఘటన కూడా ఇతని పథకరచనే అని తేలింది. ముగ్గురి హత్య కేసులో మొత్తం 44మందిపై పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పటివరకు సంజయ్ సహా 25మంది అరెస్టయ్యారు. ఢిల్లీలో ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా ఇంకా ఢిల్లీకే చెందిన మరో 8మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది.

 Main shooter arrested in firing incident on Nagaraju

సంజయ్‌ను యుపి పోలీసులు మీరట్‌లో అతను వాడిన రివాల్వర్‌తో సహా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించారు. ఇతనిపై యుపిలో మూడు హత్య కేసులు, ఐపిసి 307 సెక్షన్ కింద ఒక కేసు, దొమ్మీ కేసు ఒకటి, అనధికారికంగా మారణాయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగంపై 3 కేసులు నమోదై ఉన్నట్లు గన్నవరం సిఐ రామ్‌కుమార్ తెలిపారు.

మీరట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంజయ్ 2004లో తన ఇంటి సమీపంలో ఒక వ్యక్తితో గొడవపడి జైలుకు వెళ్లాడు. అశోక్ అనే వ్యక్తితో కలిసి సోలంకి అనే అతన్ని మెడకోసి హత్య చేశాడు. సంజయ్‌కు ఈ కేసులో మూడున్నరేళ్ల జైలుశిక్ష పడింది. జైలులో ఉన్నప్పుడే సత్యేందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలయిన తర్వాత అతనితో కలిసి నేరాల బాట పట్టాడు. 2009లో పోలీస్ ఇన్‌ఫార్మర్ ప్రమోద్ గుప్తాను హత్య చేశాడు.

2010లో ఒక హత్యాయత్నం కేసులో ఘజియాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇదే సమయంలో భవాని ద్వారా కల్యాణ్‌పురికి రాకపోకలు సాగించే ఏలూరు నివాసితులు శీను, శివ అనే వారితో ఇతనికి పరిచయం ఏర్పడింది. తమ అన్న భూతం దుర్గారావు మంచి వ్యక్తి అని, అతన్ని కొందరు 2014లో దారుణంగా హత్య చేశారని, దానికి ప్రతీకారంగా వారిని ఎలా అయినా హతమార్చాలంటూ సంజయ్‌ను, అతని స్నేహితులు ప్రతాప్‌సింగ్, నీరజ్, ధరమ్‌వీర్, నితిన్‌లను వీరు సహాయం కోరారు. ఈమేరకు జరిగిన వ్యూహరచన చేశాడు.

English summary
Main accused Sanjay has been arrested attempt to murder case of astrologer Nagaraju at Saroornagar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X