బ్లేడ్‌తో కోసుకుని విమానంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అధికారుల వివరాల ప్రకారం - హైదరాబాద్ నగరంలోని మాదన్నపేటకు చెందిన ఇంతియాజ్ అహ్మద్ దుబాయ్ నుంచి శుక్రవారం ఉదయం 9.30కి విమానంలో వస్తుండగా, అతను బాత్‌రూమ్‌లోకి వెళ్లి బెల్టుతో గొంతు కోసుకున్నాడు.
విమాన సిబ్బంది సమాచారంతో పైలెట్ అతి వేగంగా విమానాన్ని దింపేశాడు. తీవ్ర గాయాలైన అతన్ని అపోలో ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విమానం శంషాబాద్ విమానాశ్రయంలో దిగడానికి కొద్ది సేపటి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.
అతని కుడి కాలికి కూడా గాయమైంది. వైద్యులు అత్యవసరంగా అతనికి శస్త్రచికిత్స చేశారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications