అక్రమ సంబంధం: భార్యాకూతుళ్లను హత్య చేశాడు

Man kills wife and daughter in Srikakluam district
శ్రీకాకుళం: భార్యను, కన్న కూతురిని హత్య చేసిన ఓ వ్యక్తి ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటన సోమవారం పాలవలస గ్రామంలో జరిగింది. తన భార్య సరస్వతి(22), కుమార్తె ప్రవళ్లిక(2)ను ఆదివారం రాత్రి 11 గంటల తర్వా త గ్రామానికి చెందిన అడివరపు గోవిందరావు(25) ఒక పథకం ప్రకారం హత్య చేశాడు. కత్తితో తల్లి, పిల్లల తలలు నరికేశాడు.

అడివరపు సరస్వతి స్వగ్రామం ఎల్ఎన్‌పేట మండలం కొవిలాం. వీరికి వివాహమై ఐదేళ్లు కావస్తోంది. భార్యాభర్తలు కొన్నాళ్లు అన్యోన్యంగా కాపురం చేశారు. మొదటి సంతానంగా కుమారుడు అఖిల్ జన్మించాడు. అనంతరం రెండేళ్లకు సరస్వతి మళ్లీ గర్భం దాల్చింది. అయితే గోవిందరావు సరస్వతిపై అనుమానంతో ఆమె కన్నవారింటికి పంపివేశాడు. అక్కడే ప్రవళ్లిక జన్మించింది.

ఏడాది తర్వాత గోవిందరావు కొవిలాం వెళ్లి తన భార్యను తనతో పంపించాలని పెద్ద మనుషులు, అత్తవారిని కోరాడు. దీంతో వారు ఈనెల ఐదో తేదీన పంపించారు. శని, ఆదివారాల్లో భార్యాపిల్లలతో గోవిందరావు సరదాగా గడిపాడు. అయితే ఆదివారం రాత్రి 11 గంటల తరువాత ఎవరూ లేని సమయం చూసి గోవిందరావు తన భార్య సరస్వతి, కుమార్తె ప్రవళ్లిక గొంతులను కత్తితో దారుణంగా కోసి హతమార్చాడు. వెంటనే సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

తన భార్య, కూతుర్ని తానే చంపానని పోలీసులకు తెలిపాడు. చాలా కాలంగా భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబం ధం ఉన్నదనే నెపంతో కుమార్తె కూడా వారికే పుట్టిందనే అనుమానంతో హతమార్చినట్లు హంతకుడు గోవిందరావు తెలిపాడు. సరస్వతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+