ఇద్దరు కానిస్టేబుల్స్ మధ్య పెళ్లి గొడవ: పెళ్లి చేసుకుని పరారైన యువ కానిస్టేబుల్
కష్టాలు సామాన్యులకే కాదు... పోలీసులకు తప్పడం లేదు. ఒక మహిళా కానిస్టేబుల్ని ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించిన మరో కానిస్టేబుల్ ఉందంతమిది.
విజయవాడ: కష్టాలు సామాన్యులకే కాదు... పోలీసులకు తప్పడం లేదు. ఒక మహిళా కానిస్టేబుల్ని ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించిన మరో కానిస్టేబుల్ ఉందంతమిది. జి.కొండూరు పోలీసుస్టేషనులో మహిళ కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బాడిశ గోపికృష్ణ శంభు అనే కానిస్టేబుల్ (పీసీ 1690) 2014లో జి.కొండూరు. పీఎస్ లో కానిస్టేబుల్ గా చేరాడు. అదే పోలీసుస్టేషనులో 2011 నుండి 2016 వరకు ఒక మహిళా కానిస్టేబుల్ కూడా పనిచేసింది. ప్రస్తుతం ఆమె రైల్వే జనరల్ పోలిస్ కానిస్టేబుల్ గా డిప్యుటేషన్ పై బదిలీ ఆయు7 విజయవాడలో పని చేస్తోంది. కాగా మహిళ కానిస్టేబుల్ ని గోపికృష్ణ కంటే వయసులో రెండేళ్లు పెద్ద అయినా సరే మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని, ఈ విషయంపై ఇరువురు తల్లిదండ్రులతో తానే మాట్లాడతానని నమ్మించాడు.

ఆమెను తన ఆర్ధిక అవసరాల కోసం వాడుకున్నాడు. జి.కొండూరు, మైలవరం పోలీసు డిపార్ట్మెంట్ పరిధిలో తాను మహిళా కానిస్టేబుల్ ని పెళ్లి చేసుకుంటానని అందరికి ప్రచారం చేసాడు. తనను పెళ్లి చేసుకునే విషయంపై గోపికృష్ణను మహిళ కానిస్టేబుల్ ప్రశించగా ఈ నెల 25న తెల్లవారుజామున 5.10 గంటలకు పెళ్లి ముహూర్తం ఉందని అప్పటికి పెళ్లికి రెడీ కావాలని మహిళ కానిస్టేబుల్ ను నమ్మబలికాడు.
ఆమె పెళ్లికి రెడీ అయ్యి నూతన వస్త్రాలు, ఇతర సామానులు ఏర్పాట్లు చేసుకుంది. తాను డ్యూటీ పనిలో కోదాడలో ఉన్నానని అక్కడనుంచి రాగానే పెళ్లి చేసుకుంటానన్నాడు. తనకు డ్యూటీలో తీరిక లేనందున పెళ్లి గురించి అందిరికీ చెప్పే సమయం కూడా లేదని మహిళ కానిస్టేబుల్ ని నమ్మించాడు. పెళ్లికి రెడీ అయిన మహిళ కానిస్టేబుల్ రోజులు గడచిన గోపికృష్ణ నుంచి స్పందన లేదు. 25న గోపికృష్ణ ఫేస్ బుక్ అకౌంట్లో మరో యువతితో పెళ్లి అయినట్లు పోస్టింగ్ ను మహిళ కానిస్టేబుల్ గుర్తిచింది. దీనిపై గోపికృష్ణను ప్రశ్నించిన ఫలితం లేదు.
ఈ నెల 24న గాజువాకకు చెందిన మరో యువతిని గోపికృష్ణ పెళ్లి చేసుకున్నట్లు నిర్ధారణ అయింది. గోపికృష్ణ తనను నమ్మించి ద్రోహం చేసిన వైనంపై మహిళ కానిస్టేబుల్ జి.కొండూరు పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా చట్టప్రకారం కేసు నమోదు చేసి ఎస్సై డి రాజేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications