చివరి నిమిషంలో ప్రియుడి పరారీ: ఆగిన పెళ్లి
తిరుపతి: ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒక్కటి కావాలని చెప్పి కలిసి జీవించాలని అనుకుని రిజిష్టర్ వివాహం కూడా చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి ప్రేమజంటకు సంప్రదాయబద్దంగా వివాహం చేయాలని అనుకున్నారు.
అయితే చివరి నిమిషంలో ప్రియుడు పరారీ అయ్యాడు. దాంతో పెళ్లి ఆగిపోయింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం రాసికండ్రిగకు చెందిన వివేక్, తమిళనాడుకు చెందిన సంగీత ప్రేమించుకున్నారు. గత ఆగస్టు 18వ తేీదన గుమ్మడిపూడిలో వారిద్దరూ రిజిష్టర్ వివాహం చేసుకున్నారు.

దాంతో ఇరు కుటుంబాల పెద్దలు జోక్యం చేసుకుని సంప్రదాయబద్దంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో పెళ్లి ఉందనగా ప్రియుడు ఉడాయించడంతో పెళ్లి ఆగిపోయింది. బాధితురాలి బంధువులు తిరువల్లూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications