షాకింగ్ యాక్సిడెంట్: వంతెన పైనుంచి కిందపడ్డ కారు, ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా కాకాని సమీపంలోని బుడంపాడు రైల్వే బ్రిడ్జి వద్ద జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవగా, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
కాకాని: వేగంగా ప్రయాణిస్తోన్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, రైల్వే వంతెనపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవగా, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
గుంటూరు జిల్లా కాకాని సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. మృతులు బెంగళూరుకు చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లుగా పోలీసులు గుర్తించారు.
బెంగళూరుకు చెందిన నలుగురు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఓ వివాహానికి హాజరై, తిరిగి స్వస్థలానికి వెళుతుండగా ప్రమాదంలో చిక్కుకున్నారు.

వారు ప్రయాణిస్తున్న కారు సరిగ్గా బుడంపాడు రైల్వే బ్రిడ్జి వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బ్రిడ్జిపై నుంచి 30 అడుగుల కిందకు పడిపోయింది. ఈ ఘటనలో కారులోని ఒకరు అక్కడికక్కడే మరణించారు.
మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించగా, ఒకరు మాత్రం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు మృతుల కుటుంబీకులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications