అతని విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా భోళాశంకర్ నిలిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర దీన్ని నిర్మించారు. విడుదలైన మొదటిరోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ రావడంతో సినిమా వసూళ్లు మందగించాయి. సినిమా నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీగా నష్టం వచ్చింది. తమను ఆదుకోవాలంటూ ఈ సినిమా విడుదల చేసినవారంతా అనిల్ సుంకరను కోరుతున్నారు.
అయితే కొద్దిరోజులుగా చిరంజీవి రెమ్యునరేషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాత దగ్గర మొహమాటం లేకుండా చిరంజీవి డబ్బులు వసూలు చేశారంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. భోళాశంకర్ బడ్జెట్ రూ.90 కోట్లు కాగా అందులో చిరంజీవి ఒక్కడికే రెమ్యునరేషన్ కింద రూ.55 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే సినిమా డిజాస్టర్ కావడంతోపాటు నిర్మాతకు కుడా ఆర్థిక కష్టాలు ఎదురుకావడంతో చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు పారితోషికంగా రావాల్సిన అమౌంట్ ను అనిల్ ఇవ్వచూపగా రూ.10 కోట్ల చెక్ ను చిరంజీవి తిరస్కరించినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి అంత డిమాండ్ చేశారని, ఇంత డిమాండ్ చేశారని వచ్చిన వార్తలన్నీ నిరాధారమని తేలిపోయింది. ఏజంట్ సినిమాను కొనుగోలు చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకే అనిల్ భోళాశంకర్ ఇచ్చారుకానీ అది కూడా డిజాస్టర్ కావడంతో వీరంతా నిండా మునిగిపోయారు. డిస్ట్రిబ్యూటర్లెవరూ నిర్మాతకు సొమ్ములు చెల్లించలేదు. కేవలం అడ్వాన్స్ లతో సరిపెట్టేశారు.












Click it and Unblock the Notifications