ఏపీలో మరో ఎన్నికలు- ఓటర్ లిస్ట్ లు, పోలింగ్ కేంద్రాల గుర్తింపుకు మార్గదర్శకాలు..!

ఏపీలో వరుసగా స్దానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతున్నాయి. ఇప్పటికే 23 స్ధానాలు మినహా మిగిలిన చోట్ల మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. వీటి తర్వాత మిగిలిన ఎన్నికల్ని కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం (ap govt) సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఎంపీటీసీల్లో వెయ్యి మార్కు దాటిన వైసీపీ..! ఇంత ప్రభంజనంలోనూ..!
ఎంపీటీసీల్లో వెయ్యి మార్కు దాటిన వైసీపీ..! ఇంత ప్రభంజనంలోనూ..!

రాష్ట్రంలో సహకార ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందులో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) వారీగా ఓటర్ల జాబితాలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించాలని ఆదేశాలిచ్చింది. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా సహకార అధికారులకు సహకార శాఖ సూచించింది. ఎన్నికల నిర్వహణ, సన్నాహక చర్యలపై రాష్ట్ర సహకారశాఖ ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.

ap govt issues guidelines for co-operative society elections including voter list preparation polling centres identification
బొత్స కూతురికి షాక్ - కోడలు, సోదరి, సిరి సహస్ర ఆధిక్యం- మజ్జి శ్రీనుకు అక్కడ ఝలక్..!
బొత్స కూతురికి షాక్ - కోడలు, సోదరి, సిరి సహస్ర ఆధిక్యం- మజ్జి శ్రీనుకు అక్కడ ఝలక్..!

జిల్లాల సహకార శాఖాధికారులంతా ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని,, ఇందులో ఎలాంటి జాప్యం జరిగినా, నిర్లక్ష్యం వహించినా తీవ్రంగా పరిగణిస్తామని సహకార శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అధికారిక ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ కోసం వేచిచూడకుండా.. అవసరమైన క్షేత్ర స్థాయి కార్యకలాపాల్ని ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సహకార ఎన్నికల ప్రక్రియ ముగిసే లోపే మిగిలిన మున్సిపల్ ఎన్నికలు, అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని కూడా పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా ఎస్ఈసీ ఇప్పటికే పెండింగ్ మున్సిపాలిటీల్లో ఓటరు జాబితాల్ని సిద్దం చేయిస్తోంది. కోర్టు కేసులు కూడా తేలిపోతే డిసెంబర్ లోగా ఈ ఎన్నికల్ని నిర్వహించే అవకాశం ఉంది. ఈ లెక్కన స్దానిక ఎన్నికలన్నీ పూర్తి చేసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+