చంద్రబాబుకు రిక్వెస్ట్.. రఘురామకు సవాల్; అమరావతి సభపై మంత్రి బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు

తిరుపతిలో అమరావతి నేతలు నిర్వహించిన సభ పై వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అమరావతి కోసం జరిగిన బహిరంగ సభ రైతులు రాజధాని కోసం చనిర్వహించిన బహిరంగ సభ కాదని, చంద్రబాబు కోసం నిర్వహించిన బహిరంగ సభ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులే ముద్దు అంటున్నారని పేర్కొన్నారు.

అమరావతి సభను టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రులు

అమరావతి సభను టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రులు

మూడు రాజధానుల ఏర్పాటుతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. మూడు రాజధానుల ఏర్పాటు జరిగి తీరుతుందని తేల్చి చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం చంద్రబాబు బినామీల కోసం చేస్తున్న పోరాటం అని అమరావతి పోరాటాన్ని అభివర్ణిస్తున్నారు. తాజాగా ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరుపతి సభలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

మోడీ రాజధాని అమరావతినే అని చెప్పలేదు

మోడీ రాజధాని అమరావతినే అని చెప్పలేదు

తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభలో వైసీపీ పై మండిపడిన టీడీపీ అధినేత చంద్రబాబుకు, సిపిఐ నేత రామకృష్ణకు, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని విషయంలో విపక్ష నేతలు మాట్లాడే మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయని మాట్లాడిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి లోనే ఉంటుందని ఎన్నడూ చెప్పలేదన్నారు. ఒకవేళ ఆయన చెప్తే బహుశ సిపిఐ రామకృష్ణ కు ఫోన్ చేసి చెప్పారేమో తనకు తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈ విషయంలో ప్రధాని మోడీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా ఎలాంటి ఫోన్ కాల్ చేయలేదని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు.

 ఐదేళ్ళలో కనీసం కరకట్టపై రోడ్డు కూడా వెయ్యలేదు చంద్రబాబు

ఐదేళ్ళలో కనీసం కరకట్టపై రోడ్డు కూడా వెయ్యలేదు చంద్రబాబు

గతంలో చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో కనీసం కరకట్టపై రోడ్డు కూడా వేయలేక పోయారని, అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మంత్రి బాలినేని నిలదీశారు.రాజధానిని గ్రాఫిక్స్ లో చూపించి మోసం చేయడం వల్లే ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై విరుచుకుపడిన మంత్రి బాలినేని రఘురామకు దమ్ము, ధైర్యం ఉంటే పదవికి రాజీనామా చేసి టీడీపీ టికెట్ పై పోటీ చేయాలని సవాల్ విసిరారు.

విశాఖ రాజధానిగా చెయ్యటానికి చంద్రబాబు సహకరించాలని రిక్వెస్ట్

విశాఖ రాజధానిగా చెయ్యటానికి చంద్రబాబు సహకరించాలని రిక్వెస్ట్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజును సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు పొగుడుతున్నారు అంటూ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే టీడీపీ నుండి పోటీ చేయాలని చాలెంజ్ చేశారు. ఇక విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతమని, దానిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి పెద్దగా నిధులు కూడా అవసరం లేదని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. వైజాగ్ రాజధానిగా కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ విషయంలో, సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+