వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసు...పవన్ అంటే ఇష్టం...కానీ:లోకేష్ వ్యాఖ్యలు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి: కాపు రిజ‌ర్వేష‌న్లపై జ‌గ‌న్ ఏం మాట్లాడారో ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేష్ చెప్పారు. జగన్ వ్యాఖ్యలు అన్ని కెమెరాల్లో రికార్డు అయ్యాయని...ఇంక వాటి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని లోకేష్ అన్నారు.

Recommended Video

కాపు ఓట్ల కోసం ముద్రగడతో టీడీపీ మంతనాలు..?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మంత్రి లోకేష్ బుధవారం మరో 10 ఐటి కంపెనీలను ప్రారంభించారు. అనంతరం కొత్తగా ఏర్పాటైన 10 ఐటీ కంపెనీల సీఈవోలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల‌క్ష ఐటీ ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ఐటీలో 36 వేలు, ఎలక్ట్రానిక్స్ లో 20 వేల ఉద్యోగాలు కల్పించామని మంత్రి తెలిపారు.

5 సైబరాబాద్ లు...అదీ విజన్

5 సైబరాబాద్ లు...అదీ విజన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సైబ‌రాబాద్‌లు నిర్మించాల‌నేది తమ విజ‌న్ అని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. జియో ఫోన్ల తయారీ కోసం తిరుప‌తిలో 125 ఎక‌రాలు సేకరించామని సమావేశంలో తెలిపారు. విశాఖ, చిత్తూరు, అనంతపురం, గోదావరి జిల్లాల్లో ఐటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏపీలో ఎంవోయూ కన్వర్షన్ 48 నుంచి 53 శాతం ఉందనని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.

ఫైబర్ గ్రిడ్‌కు...ఎంఎస్‌వోలు సహకరించాలి

ఫైబర్ గ్రిడ్‌కు...ఎంఎస్‌వోలు సహకరించాలి

ఫైబర్ గ్రిడ్‌కు ఎంఎస్‌వోలు సహకరించాలని కోరారు. ఫైబర్‌గ్రిడ్‌తో ఎంఎస్‌వోలకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆగ‌స్టు 15 నాటికి ఫైబ‌ర్ గ్రిడ్ ద్వారా 5లక్షల కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని పంచాయతీలకు ఫ్రీ వైఫై కన్షెక్షన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా లోకేష్ పేర్కొన్నారు.

 అనుభవం ఉన్న నేత...కావాలి

అనుభవం ఉన్న నేత...కావాలి

అనంతరం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు లోకేష్ జవాబిస్తూ రాష్ట్రానికి అనుభ‌వం ఉన్న నేత కావాలన్న విషయం జగన్‌ వ్యాఖ్యలతో స్పష్టమైందని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని...అయితే ఆయన తనపై ఆరోపణలు...విమర్శలు చేస్తే మాత్రం బాధ కలుగుతుందన్నారు. తనపై అవినీతి, దోపిడీ ఆరోపణలు చేయడం పవన్ కళ్యాణ్ కు తగదని అన్నారు.

పవన్ అంటే ఇష్టం...అలాగే బాధపడ్డా

పవన్ అంటే ఇష్టం...అలాగే బాధపడ్డా

తనపై ఆరోపణలకు సాక్ష్యాధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరినా ఇంత వరకు పవన్ నిరూపించలేకపోయారని లోకేష్ ఎద్దేవా చేశారు. తాను అవినీతి పరుడినైతే ఏపీలో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఎందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని మంత్రి లోకేష్ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన సమయంలో ఆయన ఏ రకంగా బాధ పడ్డారో...తనపై కూడ పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేసిన సమయంలో తాను కూడ అలాగే బాధపడ్డానని లోకేష్ తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని ఆపుతామని పవన్‌ అనడం సరికాదన్నారు. 10 మంది కోసం రాజధాని నిర్మాణం ఆగదని మంత్రి లోకేష్‌ తేల్చిచెప్పారు.

English summary
Amaravati: All the people know that what Jagan spoke about Kapu reservations, "Lokesh said. He said that the comments have been recorded in all the cameras ...now there is no need to talk about them again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X