పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. మేము రాయలసీమకు నీళ్లు ఇస్తాం, రెడ్డి ధీమా
ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతకాలం పెత్తనం చాలాయించిన వైసీపీ నాయకులకు సైలెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, టీడీపీ, జనసేన నాయకులు వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు చెక్ పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నాయకులు చకచకా రంగం సిద్దం చేస్తున్నారని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు సర్వనాశనం చేశారని సీఎం చంద్రబాబుతో సహ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.

ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఆ పోలవరం నీళ్లు రాయలసీమకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మదనపల్లెలో మీడియాతో మాట్లాడిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని, వైసీపీ ప్రభుత్వం నిర్లక్షం కారణంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణత్య తగ్గిపోయిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని, పోలవరంతో పాటు పెండింగ్ ప్రాజెక్టు పనులు అన్ని పూర్తి చెయ్యాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు, ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించారు అనే విషయంపై బహిరంగ చర్చకు వైసీపీ నాయకులు సిద్దం కావాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ నాయకులకు సవాలు విసిరారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి భూ అక్రమణలకు, ఇసుక అక్రమ రావాణా దందాలకు పాల్పడ్డారని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన అక్రమాలు మరెక్కడా జరగలేదని, వారి పాపాలు వారినే నీడలా వెంటాడుతున్నాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పుంగనూరు నియోజక వర్గం టీడీపీ ఇన్ చార్జ్ చల్లా రామచంద్రా రెడ్డి ఆరోపించారు. త్వరలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ జాతకాలు మొత్తం బయటకు వస్తాయని, వారు చేసిన పాపాలలో వారే కొట్టుకునిపోతారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు












Click it and Unblock the Notifications