ఆ నేతలపై నేరుగా సీఎం జగన్ కు మంత్రి రోజా ఫిర్యాదు..!!
ముఖ్యమంత్రి జగన్ ను మంత్రి రోజా క్యాంపు కార్యాలయంలో కలిసారు. తన నియోజకవర్గంలోని పరిస్థితులను వివరించారు. పార్టీలోని కొందరు నేతలు తనను లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసారు. 2019 ఎన్నికల్లో గెలిచన నాటి నుంచి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి నివేదిక రూపంలో మంత్రి రోజా సీఎంకు అందించారు. అందులో..నియోజకవర్గంలో కొందరు ఉద్దేశ పూర్వకంగానే తనకు వ్యతిరేకంగా పని చేస్తూ..తనను రాజకీయంగా బలహీనపర్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు చేసారు.
ఈ మధ్య కాలంలో నగరిలో కొందరు నేతలు మంత్రి రోజాకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. మంత్రిని పక్కన పెట్టి అధికారిక కార్యక్రమాలను సైతం పూర్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా రోజాకు సమాచారం కూడా అందటం లేదు. దీంతో, మనస్థాపానికి గురైన మంత్రి రోజా కార్యకర్తలతో తన ఆవేదన వ్యక్తం చేసారు, ప్రతిపక్ష పార్టీల్లో తాను డామేజ్ అయ్యే విధంగా కొందరు పని గట్టుకొని ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వాపోరు.

ఇలా చేస్తే రాజకీయాలు చేయలేమంటూ రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో, మంత్రి రోజా ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎంకు నేరుగా నివేదించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ముఖ్యమంత్రితో సమావేశమై నగరిలోని పరిస్థితులను వివరించారు.
ఈ నెల 16వ తేదీన తనకు సమాచారం లేకుండా ఆర్బీకేల తో పాటుగా వెల్ నెస్ సెంటర్లను ప్రారంభించటం పైన ఫిర్యాదులో వివరించారు. తనను బలహన పర్చాలనే ఉద్దేశంతో పార్టీ నష్టపోయేలా వ్యవహరిస్తున్నారని మంత్రి నేరుగా సీఎంకు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి రోజా చెప్పిన సమాచారం పూర్తిగా విన్న సీఎం జగన్.. తాను పరిశీలన చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నగరి పంచాయితీ నేరుగా సీఎం వద్దకు చేరటంతో, ఇక నియోకవర్గంలో రానున్న రోజుల్లో చోటు చేసుకొనే పరిస్థితులు ఏ విధంగా మారుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications