Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అద్వితీయంగా బ్రహ్మోత్సవాలు

Vontimitta: శ్రీరామనవమిని పురస్కరించుకుని క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యం బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభం అయ్యాయి. ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు కొనసాగనున్నాయి. ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను టీటీడీ అధికారులు అంగరంగ వైభ‌వంగా నిర్వహిస్తోన్నారు. ప్రతీరోజు కోదండరాములవారు వేర్వేరు అవతారాలతో భక్తులకు దర్శనం ఇస్తోన్నారు.

వటపత్రశాయి అలంకారంలో..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో కోదండరామస్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం 7:30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. వందలాద మంది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు పట్టారు. స్వామివారిని దర్శించుకున్నారు.

Ministers Anam Ramanarayana Reddy and Savitha reviewd on Vontimitta Brahmotsavam

పండుగ వాతావరణంలో..

ఈ నెల 11వ తేదీన జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. ఒంటిమిట్టలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత, రవాణా శాఖ మంత్రి ఎం రామ్ ప్రసాద్ రెడ్డి, పలువురు తిరుమల తిరుపతి దేవస్థానం, జిల్లా అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

2015 నుంచి..

రాష్ట్ర విభజన అనంతరం దేవాదాయ శాఖ నుండి ఒంటిమిట్ట ఏకశిలానగరాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీలో విలీనం చేశారని గుర్తు చేశారు. అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు.

ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా..

ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున..

రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు సీతారాముల వారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారని, 11వ తేదీన ఆయన ఒంటిమిట్ట ఆలయానికి వస్తారని రామనారాయణరెడ్డి చెప్పారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా టీటీడీ, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

ముఖ్యమంత్రి భద్రత కోసం..

ముఖ్యమంత్రి వచ్చి వెళ్లేంత వరకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైవే సెక్టార్‌లలో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య రాయచోటి జిల్లాల నుండి అంబులెన్సులను అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం వినియోగించే సీసీటీవీ, డ్రోన్ కెమెరాల సంఖ్యను మరింత పెంచాలని అన్నారు.

Ministers Anam Ramanarayana Reddy and Savitha reviewd on Vontimitta Brahmotsavam

అగ్నిమాపక సర్వీసులను అందుబాటులో..

వేసవి నేపథ్యంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అగ్నిమాపక సర్వీసులను అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. భక్తులు వెలుపలికి సులువుగా వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు.

గొప్ప పుణ్యక్షేత్రంగా..

ఒంటిమిట్ట ఆలయాన్ని గొప్ప పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి తమ కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రామనారాయణరెడ్డి వివరించారు. ప్రధాన ఆలయాలతో పోటీపడేలా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత మాట్లాడుతూ- అందరూ కలిసి కట్టుగా సమష్టిగా పనిచేసి సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో..

కల్యాణ వేదిక ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్యాణ వేదిక వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు.

వాహనాల పార్కింగ్‌..

కడప జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది పటిష్ట బందోబస్తు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, వాహనాల పార్కింగ్‌, భక్తుల అవసరాలకు తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

కళ్యాణ వేదిక వద్ద బారికేడ్లు..

కళ్యాణ వేదిక వద్ద బారికేడ్లు, అన్న ప్రసాద కౌంటర్లు, లైటింగ్, వైద్యశిబిరాలు, మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ధ్య సిబ్బంది తదితర అంశాలపై చర్చించారు. సమీక్షకు ముందు కల్యాణోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులకు జిల్లా కలెక్టర్, టీటీడీ జేఈవో వీరభద్రం, జిల్లా ఎస్పీ, టీటీడీ సీవీఎస్వో వివరించారు.

ఉన్నతాధికారులతో కలిసి పరిశీలన..

అంతకుముందు కల్యాణ ప్రాంగణం వద్ద భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి, సవిత, జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈవో వీ వీరబ్రహ్మం, సివిఎస్వో హర్షవర్ధన్ రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తదితర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

పూర్ణకుంభ స్వాగతం

ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రులకు టీటీడీ జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ మండపంలో జేఈవో మంత్రులకు శేష వస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+