వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారితో ఆడుకున్న శిల్పా: అఖిలప్రియ అడగ్గానే చంద్రబాబు..

వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు బిక్షాటన తప్పదని, రెండేళ్ల కాలానికి నంద్యాలలో పోటీ చేసి జగన్ ఏం సాధిస్తారో చెప్పాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు బిక్షాటన తప్పదని, రెండేళ్ల కాలానికి నంద్యాలలో పోటీ చేసి జగన్ ఏం సాధిస్తారో చెప్పాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు.

<strong>బాబుకు నంద్యాల షాక్: లగడపాటి సర్వేలో వైసిపి గెలుపు, ఆ వ్యూహం పని చేయదా?</strong>బాబుకు నంద్యాల షాక్: లగడపాటి సర్వేలో వైసిపి గెలుపు, ఆ వ్యూహం పని చేయదా?

ఆటో నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు, ఆదినారాయణ రెడ్డి, అఖిలప్రియ, టిడిపి సీనియర్ నేత కేఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జగన్ పైన నిప్పులు చెరిగారు.

పులివెందుల కంటే ఎక్కువ, కుప్పంతో సమానంగా నంద్యాల

పులివెందుల కంటే ఎక్కువ, కుప్పంతో సమానంగా నంద్యాల

ప్రజల సొమ్మును దోచుకొని, దాచుకోవడం తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమం జగన్‌కు పట్టదన్నారు. నంద్యాలను పులివెందుల కంటే ఎక్కువగా, కుప్పంతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నంద్యాల పట్టణంలో ఎన్నికలు వచ్చే నాటికి రూ.1200 కోట్లు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు.

శిల్పా వారి జీవితాలతో ఆడుకున్నారు

శిల్పా వారి జీవితాలతో ఆడుకున్నారు

ఆటో నగర్‌వాసులకు నాలుగు రోజుల్లో రిజిస్ట్రేషన్లు చేపిస్తామని అఖిలప్రియ చెప్పారు. భూమా బ్రహ్మానంద రెడ్డి ఆటోనగర్‌ను దత్తత తీసుకుుంటారని తెలిపారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు అన్ని పది రోజుల లోపల పూర్తి చేస్తామన్నారు. శిల్పా మోహన్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉండి సమస్యలు పరిష్కరించకుండా నాన్చుడు ధోరణి అవలంబించి ఆటో కార్మికుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. స్థానికుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం చేస్తామని కేఈ ప్రభాకర్ చెప్పారు.

Recommended Video

YS Jagan Shock To Bhuma Akhila Priya
బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలి

బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలి

నంద్యాల అభివృద్ధి టిడిపితో సాధ్యమని, ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో టిడిపిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

అఖిలప్రియ అడగ్గానే..

అఖిలప్రియ అడగ్గానే..

మంత్రి అఖిలప్రియ అడిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.కోట్లు మంజూరు చేశారని టిజి వెంకటేష్ తెలిపారు. ఎవరైనా కోరికలు తీరాలంటే టిడిపి ప్రభుత్వం ద్వారానే సాధ్యమన్నారు. కార్మికులు, రైతులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులుగాని టిడిపి ప్రభుత్వాన్ని ఆదరిస్తే మరిన్ని అభివృద్ది కార్యక్రమాలను చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. మద్యం నిషేధిస్తామన్న జగన్ పక్క రాష్ట్రంలో కూడా మద్య నిషేధం లేకుండా చేస్తారా అని పశ్నించారు. ప్రభుత్వానికి ఎంత మేలు చేస్తే ఆదరణ కూడా అంత రెట్టింపు ఉంటుందన్నారు.

English summary
Telugudesam party leaders and Ministers say they TDP government will develop Nandyala along with Kuppam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X