శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. భయపడిన జనం, అధికారులకు విన్నపం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున భూప్రకంపనలు స్థానికంగా ఉన్నవారిలో కలకలాన్ని రేపాయి. ఇచ్చాపురం పరిసర ప్రాంతాలలో నేడు తెల్లవారుజామున 3 గంటల 42 నిమిషాలకు భూమి స్వల్పంగా కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. అందరూ మంచి నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని కొద్దిగా భూమి కనిపించిందని స్థానికులు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం
భూమి కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన వారు బయటకు పరుగులు తీశారు. అయితే గతంలో రెండు సంవత్సరాల క్రితం అక్టోబర్ మాసంలో కూడా పలుమార్లు భూమి స్వల్పంగా ప్రకంపనలు సృష్టించిందని, అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ప్రకంపనలు చాలా అత్యల్పమని స్థానికులు చెబుతున్నప్పటికీ స్థానికులలో భూకంపం నేపథ్యంలో ఆందోళన కనిపిస్తుంది.

ఆరా తీస్తున్న అధికారులు
అయితే శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు తెల్లవారు జరిగిన భూ ప్రకంపనుల వ్యవహారం పైన అధికారులు ఆరా తీస్తున్నారు. కచ్చితంగా రెండు సెకండ్ల పాటు భూమి కంపించిందని, నిద్రలో నుంచి లేచి ఒక్కసారిగా అందరం వీధుల్లోకి పరుగులు తీశామని స్థానికులు అధికారులకు చెప్పారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యామని పేర్కొన్నారు.
భయపడుతున్న స్థానికులు.. అధికారులకు విజ్ఞప్తి
మళ్లీ కాసేపు ఇంట్లోకి వెళ్లడానికే భయపడ్డామని వారు చెప్పారు. అయితే ఈ భూకంపం భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు చర్చిస్తున్నారు. భూమి పదేపదే ప్రకంపనలతో తమను హెచ్చరిస్తుందని అందుకు అధికారులు భూకంపం ప్రమాదం ఏదైనా ఉంటే ముందే గుర్తించి తమను అప్రమత్తం చేస్తే మంచిదని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికులను భయపడవద్దని అధికారుల సూచన
తమ సమస్యను తేలికగా తీసుకోకుండా భూ ప్రకంపనలకు కారణాలు వెతకాలని, ముందు ముందు ఇవి తీవ్రతరం కాకుండా అధికారులు తగు చర్యలకు దిగాలని స్థానికులు కోరుతున్నారు. అయితే అధికారులు భయపడవద్దని, ఏం జరిగిందో తాము తెలుసుకుని ప్రమాదం ఉంటే తప్పకుండా అప్రమత్తం చేస్తామని ప్రజలకు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications