'ఎమ్మెల్యే కాకాని కనిపించకుండా పోయారు.. 14నుంచి మిస్సింగ్'
ఈ నెల 14నుంచి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి కనిపించకుండా పోయారని ఆరోపించారు.
విజయవాడ: విదేశాల్లో బినామీ ఆస్తులు కూడబెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆమధ్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వరకు ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటల యుద్దం జరగ్గా.. ఈమధ్య మళ్లీ ఆ విషయం చర్చకు రాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కాకానిపై విరుచుకుపడ్డారు సోమిరెడ్డి. ఆరు కేసుల్లో ముద్దాయిగా ఉన్న కాకాని, ఈ నెల 14నుంచి కనిపించకుండా పోయారని ఆరోపించారు.

తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కాకాని తన మాట మీద నిలబడాలని సూచించారు. ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్న కాకాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు.












Click it and Unblock the Notifications