ఆదాల, చైతన్యరాజు పోటీ: 5గురు ఎమ్మెల్యేలు వెనక్కి
హైదరాబాద్: రాజ్యసభకు రాష్ట్రం నుంచి జరుగుతున్న ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి, చైతన్యరాజుకు ఇచ్చిన మద్దతును కొంత మంది శాసనసభ్యులు వెనక్కి తీసుకున్నారు.
ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్‌పై సంతకాలు చేసిన శాసనసభ్యులు జివి శేషు, విజయకుమార్, నీరజారెడ్డి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. అలాగే, చైతన్యరాజుకు తొలుత మద్దతు ఇచ్చిన ముత్యాలపాప, మురళి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు.

కొంత మంది శాసనసభ్యులు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏం చేయాలనే విషయంపై రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదారాం సందిగ్దంలో పడ్డారు. దీంతో శాసనసభ్యులు మద్దతు ఉపసంహరించుకుంటే ఏం చేయాలని ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని అడిగారు. ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి చెబుతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఆదాల ప్రభాకర్ రెడ్డికి శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, వెంకట్రామయ్య, ఉగ్రనరసింహా రెడ్డి,
మళ్ల విజయప్రసాద్, శిల్పా మోహన్ రెడ్డి, శ్రీధర కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు. తిరుగుబాటు అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన శానససభ్యులపై కాంగ్రెసు అధిష్టానం గుర్రుగా ఉంది. చర్యలు తప్పని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications