ప్యాన్ ఇండియా స్టార్ జూ.ఎన్టీఆర్, కానీ చంద్రబాబు - ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు..!!
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పైన రాజకీయంగా విమర్శలు చేసారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రైతన్న పండించిన ప్రతి ధాన్యం గింజకు సీఎం బాధ్యత తీసుకుంటున్నారని వివరించారు. లోకేష్ కు పోటీగా వస్తాడనే భయంతోనే జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు తీసుకురావటం లేదని వ్యాఖ్యానించారు. అయిదేళ్లు సీఎంగా పని చేసి అమరావతి ప్రాంతాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారని భరత్ నిలదీసారు.
తూర్పు గోదావరి జిల్లాలో పంట నష్టపోయిన రైతులను చంద్రబాబు పరామర్శించారు. ఆ సమయంలో ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. వీటి పైన స్పందించిన ఎంపీ భరత్ పంట నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని చెప్పారు. 35 లక్షల మెట్రిక్ టన్నులు అయినా సరే.. పూర్తిస్థాయిలో తడిచిన, రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతన్నను ప్రభుత్వం ఆదుకుంటుందని, తడిసిన, రంగుమారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వివరించారు.

తమిళ యాక్టర్ రజనీకాంత్ ను పిలిపించుకొని పొగిడించుకున్నారని వ్యాఖ్యానించారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో చేసిన అభివృద్ధి గురించి రజనీకాంత్‌తో ఎందుకు పొగిడించుకోలేదని ఎంపీ భరత్ ప్రశ్నించారు. అసలు అమరావతిలో ఏం చేసారని నిలదీసారు. తన ఇంట్లోనే ప్యాన్ ఇండియా స్టార్ జూ.ఎన్టీఆర్‌ను ఎందుకు బయటకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. లోకేష్ కు పోటీగా వస్తారనే కారణంతోనే జూ ఎన్టీఆర్ ను రానీయటం లేదని ఆరోపించారు. జగన్ కు లోకేష్ ఏ విధంగానూ పోటీ కాదని పేర్కొన్నారు. బషీర్‌బాగ్ ఘటనను ఇప్పటి వరకు దేశ ప్రజలు ఎవరూ మర్చిపోలేదని ఎంపీ వ్యాఖ్యానించారు. ఎక్కడో ఒక డ్రామా క్రియేట్ చేసి దానితో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications