ఏపీ.. మీ జాగీరా..?, కమ్మ భవనాలకు ఆ పేరు పెట్టగలరా..! : చంద్రబాబుకు ముద్రగడ సవాల్
హైదరాబాద్ : కాపు సామాజిక వర్గం ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడదే కాపులపైన స్వారీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు వ్యవహార శైలి ఏపీ పరువు తీసేదిగా తయారైందని ఎద్దేవా చేశారు.
ఓ టీవి ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. కాపులకు ఇచ్చిన హామీలపై చంద్రబాబు తీరును తప్పుబడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. సీనియర్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబు ఇంత అబద్దపు పాలన చేయడమేంటని ప్రశ్నించిన ఆయన, అనుభవం లేని వ్యక్తులు అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకున్నట్టు, చంద్రబాబు కూడా అదే ధోరణితో వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు దృష్టిలో కాపుల పరిస్థితి కరివేపాకు, గోరింటాకుల్లా తయారయ్యారని విమర్శించిన ఆయన, కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కమ్మ భవనాలు కూడా ఉన్నాయి కదా..! అని ప్రస్తావించిన ముద్రగడ, కమ్మ భవనాలకు 'కాపు కమ్మ భవనాలు' అని పేరు పెట్టేందుకు సిద్ధమా..? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు.
తని ఘటన వెనుక ఎవరి హస్తముందో తనకు తెలుసునని, సందర్భం వచ్చినప్పుడు విషయం బయటపెడుతానని చెప్పారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం సభలు నిర్వహించుకునే అర్హత కూడా లేదా..! అంటు మండిపడ్డ ముద్రగడ, 'ఈ రాష్ట్రం ఏమైనా మీ జాగీరా..! మీ అనుమతితోనే సభలు నిర్వహించుకోవాలా..?' అని నిలదీశారు.
కాపులకు అందాల్సిన రుణాలను పచ్చ చొక్కాలే కాజేస్తున్నాయని ఆరోపించారు. తన విమర్శలు చంద్రబాబు కంటే చెక్క భజనను నమ్ముకున్న వారికే ఎక్కువ కోపం తెప్పిస్తున్నాయని ఎద్దేవా చేసిన ఆయన, కాపులంతా మోచేతి నీళ్లు తాగుతూ బతుకీడ్చాలా అంటూ ఫైర్ అయ్యారు. అసలు చంద్రబాబు గను క హామియే ఇవ్వకపోయుంటే తాము ఆరోజు ఆందోళన నిర్వహించేవాళ్లమే కాదని, మెంటల్ తమకు లేదని, మీకే మెంటల్ అంటూ విమర్శలు గుప్పించారు.
చివరగా.. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఎంత పోరాటం చేయడానికైనా సిద్దం ప్రకటించారు. ఇందుకోసం అవసరమైతే తాను ఆమరణ దీక్షకైనా సిద్దమేనని తెలియజేశారు.












Click it and Unblock the Notifications