కష్టమనిపించినా: చిరుకు చేయిచ్చిన మురళీ మోహన్
రాజమండ్రి: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి మురళీ మోహన్‌లు శుక్రవారం ఒకరినొకరు ఎదురు పడ్డారు. దీంతో ఇరువురు పరస్పరం పలకరించుకున్నారు.
ప్రచారంలో భాగంగా చిరంజీవి ఓ బస్సులో.. మురళీ మోహన్ ఓ ఓపెన్ టాప్ వాహనంలో వెళ్తుండగా కొవ్వూరు-తాళ్లపూడి మధ్యలో ఎదురుబడ్డారు. పరస్పరం పలకరించుకున్నారు. అనంతరం మురళీ మోహన్ చేయి చాపారు. చిరు కిటికీ వద్ద వంగి అతనితో చేయి కలిపారు. ఇరువురు కరచాలనం చేసుకొని ఆ తర్వాత ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు.

సీమాంధ్ర అభివృద్ధికి కెసిఆర్ అడుగడుగునా అడ్డుపడ్డారని, రాష్ట్ర విభజన బాధాకరమైనా.. ఆ ద్రోహి పీడ వదిలిపోయిందని చిరంజీవి తన ప్రచారంలో అన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాలను పదమూడు హైదరాబాద్‌లుగా నిర్మించుకునే సత్తా మనకుందన్నారు. కెసిఆర్ కళ్లు తిరిగే రీతిలో సీమాంధ్రను అభివృద్ధి చేస్తామన్నారు.
రాష్ట్ర విభజనకు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపిలు వత్తాసు పలకలేదా? అని ప్రశ్నించారు. 80 గదుల సౌధాన్ని నిర్మించిన జగన్.. తండ్రిని అడ్డుపెట్టుకుని అక్రమార్జనకు పాల్పడ్డారని విమర్శించారు. బిజెపిది కమ్యూనిటీ కల్చర్, టిడిపిది కార్పొరేట్ కల్చర్, జగన్ పార్టీది క్రిమినల్ కల్చర్.. కాంగ్రెస్‌ది మాత్రం కామన్‌మన్ కల్చర్ అన్నారు.












Click it and Unblock the Notifications