శిల్పామోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు
కర్నూలు: మాజీ మంత్రి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డిపై కర్నూలు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ దేశం సులోచన తోపాటు మో ముగ్గురు కౌన్సిలర్లపైనా కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినట్లు కర్నూలు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు మాజీ కౌన్సిలర్లపైనా కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
ఇటీవల నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దాడి ఘటనపై కర్నూలు కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది. కౌన్సిల్ సమావేశంలో గొడవ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై కేసు నమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పక్షపాతంతోనే తమపై కేసులు నమోదు చేశారని, తెలుగుదేశం నేతలపై కూడా కేసులు నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు శిల్పామోహన్ రెడ్డి, నంద్యాల కౌన్సిల్ ఛైర్ పర్సన్, మరో ముగ్గురు కౌన్సిలర్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో శిల్పా మోహన్ రెడ్డి, తదితరులపై కేసు నమోదైంది.
ఇటీవల అరెస్టైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
సచివాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట బుధవారం ఓ యువకుడు ఆత్యహత్యాయత్నం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీఆర్వో పరీక్షలో తనకు అన్యాయం జరిగిందన్న బాధతో అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం అతడు సైఫాబాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications