సర్వే నిజమైంది, యూపిఏ ఇంకెంతకాలమో: లగడపాటి

తాను చేసిన సర్వే నిజమైందని, కాంగ్రెసు పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి (ఎఎపి) ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. ఎఎపి గుర్తు చీపురు కింద బ్యాట్ ఉండటంతో ఓటర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారని లగడపాటి అన్నారు. కేజ్రీవాల్ విధానానికి శిరస్సు వంచి నమస్కరించాలన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మన రాష్ట్రంపై పడబోతున్నాయని, రెండుసార్లు అధికారాన్ని ఇచ్చిన ఎపి ప్రజలకు కాంగ్రెసు పార్టీ అన్యాయం చేయడం మంచిది కాదన్నారు. దత్తపుత్రుడి కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూడటం మంచిది కాదని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోరుకునే వారమంతా సోమవారం సమావేశమౌతున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు కాంగ్రెసు పార్టీకి కనువిప్పు కలిగిస్తాయని భావిస్తున్నానన్నారు.
తాను చెప్పిన సర్వేలు నిజమయ్యాయని, కేజ్రీవాల్ పార్టీకి 30 సీట్ల వరకు వస్తాయని చెబితే కొందరు నవ్వారని గుర్తు చేశారు. సామాన్య అభ్యర్థులను పెట్టి ఆయన గెలిపించారని కితాబిచ్చారు. సరైన పార్టీలు, అభ్యర్థులు ఉంటే ఎలాంటి పార్టీనైనా ఓడించవచ్చునని ఢిల్లీ ఫలితాలు రుజువు చేశాయన్నారు. ఎపిలో 63 శాతం మంది కాంగ్రెసుతో సహా ఇతర పార్టీలను వ్యతిరేకిస్తున్నారన్నారు. వందేళ్ల చరిత్ర ఉందని కాంగ్రెసు, మోడీ ఉన్నారని బిజెపి అనుకుంటే లాభం లేదన్నారు.
ఇంకా ఘోర ఫలితాలు: హర్షకుమార్
నాలుగు రాష్ట్రాల ఎన్నికల కంటే ఘోర ఫలితాలను కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చూడాల్సి వస్తుందని అమలాపురం ఎంపి హర్ష కుమార్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ పని అయిపోయినట్లేనన్నారు. తాము పదవులకు రాజీనామా చేయమని, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తామన్నారు. అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.గ
సమైక్యంగా ఉంటేనే: శైలజానాథ్
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిదని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఐదుకోట్లకు పైగా మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలను తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ ఫలితాలతోనైనా కాంగ్రెసు పార్టీ కళ్లు తెరవాలన్నారు.
జేజమ్మ వచ్చినా ఆపలేరు: ఈటెల
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన జేజమ్మలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందన్నారు. తెలంగాణను శాసించి, పాలించే పరిస్థితికి తెరాస వస్తుందన్నారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications