నాగబాబు సంచలనం.. పాలనలో జగన్ విఫలం: పవన్ బ్రహ్మాస్త్రం :చిరు అభిమానులను సైతం..!!
మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి పాలన పైన విమర్శలు చేసారు. వంద రోజుల పాలనలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అవగాహన రాహిత్యం పైన పోరాటం చేయటానికి జనసేన సిద్దంగా ఉందని ప్రకటించారు. పవన్ బ్రహ్మాస్త్రం లాంటి వ్యక్తి అంటూ ప్రజలతో మమేకం అవుతామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో మరో కీలక వ్యాఖ్య చేసారు. భవిష్యత్‌లో చిరంజీవి అభిమానులను కలుపుకుని ముందుకు సాగనున్నామన్నారు. కార్యకర్తలకు మనోధైర్యం, పార్టీ లక్ష్యాలు తెలియజేయాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 14వ తేదీ నుండి సమీక్షలు ఏర్పాటు చేసారు. వైసీపీ వంద రోజుల పాలన గురించి ఆరా తీయటంతో పాటుగా సమస్యల పైన స్పందిస్తారని ఇప్పటికే పార్టీ స్పష్టం చేసింది. ఈ సమయంలో ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
వంద రోజుల పాలనలో సీఎం జగన్ విఫలం..
ముఖ్యమంత్రి జగన్ వంద రోజుల పాలన పైన జనసేన సమన్వయ కమిటీ చైర్మన్..మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వంద రోజుల పాలనలో ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ వంద రోజుల వైఫల్యాలు..ప్రజల కష్టాలు తీర్చటంలో ఉదాసీనత..ప్రభుత్వ అవగాహన రాహిత్యం పైన జనసేన పోరాటాలకు సిద్దంగా ఉందని నాగబాబు ప్రకటించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నాగబాబు సమీక్షలు మొదలు పెట్టారు. రాష్ట్రప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలమైందని చెప్పిన నాగబాబు ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. నాగబాబు విమర్శించారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలతో ఎలా మమేకం కావాలి, ప్రజా సమస్యలను అవగాహన చేసుకుని వాటిపై ఏ రీతిన ఉద్యమించాలో పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించే ప్రణాళికలు, కార్యాచరణను సిద్ధం చేయడంతోపాటు వివిధ అంశాలపై పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు.

అన్నయ్య అభిమానులను సైతం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నాగబాబు ప్రశంసలతో ముంచెత్తారు. పవన్‌కల్యాణ్ బ్రహ్మాస్త్రం లాంటి వ్యక్తని.., ఈ అస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ప్రజలు సమస్యల బారి నుంచి విముక్తి పొందుతారని చెప్పుకొచ్చారు. రాష్ట్రం బాగుపడాలని పరితపిస్తూ ఉండే వ్యక్తి పవన్ కల్యాణ్ మాత్రమేనని అన్నారు. సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో పవన్ జనసేన స్థాపించారన్నారు. భవిష్యత్‌లో చిరంజీవి అభిమానులను కలుపుకుని ముందుకు సాగుతామని కీలక ప్రకటన చేసారు. కార్యకర్తలకు మనోధైర్యం, పార్టీ లక్ష్యాలు తెలియజేయాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు తెలుసుకుంటున్నానని, పార్టీపై అపోహలు వదిలిపెట్టాలని సూచించారు. జనసేన పార్టీ ఏర్పాటు నుండి ఇప్పటి వరకు ప్రత్యేకంగా చిరంజీవి అభిమానుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా చిరంజీవి అభిమానులను సైతం జనసేనతో కలుపుకు వెళ్తామని చెప్పటం ద్వారా పార్టీలో కొత్త జోష్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications