కుప్పం నుంచి బరిలో నారా భువనేశ్వరి - స్వయంగా వెల్లడి..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పొత్తుల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీకి సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా నారా భువనేశ్వరి కుప్పం వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. కుప్పంలో రెండు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సయం చేశారు.ఈ సమయంలోనే స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు మనసులో ఒక కోరిక కలిగిందని చెప్పుకొచ్చారు.

35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు కుప్పంలో ఈ సారి విశ్రాంతి ఇచ్చి..తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేసారు. కుప్పం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు వరుసగా ఏడు సార్లు విజయం సాధించారు. ఈ సారి కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ భారీ కసరత్తు చేస్తోంది. కానీ, చంద్రబాబు తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు.
టీడీపీ కుప్పం అభ్యర్థిని నేనే.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!#NaraBhuvaneswari #Chandrababu #ChandrababuNaidu #Kuppam #NijamGelavali #AndhraPradesh #ApElections2024 #Oneindiatelugu pic.twitter.com/cw0F4yytqU
— oneindiatelugu (@oneindiatelugu) February 21, 2024
ప్రతీ మూడు నెలలకోసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. స్థానిక కేడర్ తో మమేకం అవుతున్నారు. ఈ సారి గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే, భువనేశ్వరిని విజయవాడ పార్లమంట్ నుంచి పోటీ చేయించాలంటూ కొందరే నేతలు ఇప్పటికే చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. కానీ, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం.కుప్పం నుంచి పోటీ చేయాలని ఉంది:నారా భువనేశ్వరి#NaraBhuvaneswari #NaraChandrababuNaidu #kuppam pic.twitter.com/MG8eOKeiaS
— Common Man (@peoplesjourno) February 21, 2024
ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కారణంగా సీట్ల సర్దుబాట్ల వ్యవహారం సంక్లిష్టంగా మారుతోంది. చంద్రబాబు, లోకేష్, బాలయ్య, భరత్ పోటీలో ఉన్న సమయంలో మరొకరిని బరిలోకి దింపటం పైన చంద్రబాబు సుముఖంగా లేరని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు కుప్పం నుంచి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలతో ఆలోచన మరిందా... కుప్పం నుంచి భువనేశ్వరి పోటీ చేయటం ఖాయమైందా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications