దమ్ముందా, అందుకే 20మంది మావైపు: వైసిపి ఎమ్మెల్యే విందులో రోజాకు లోకేష్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, రోజాకు సవాల్ విసిరారు. దమ్ముంటే తన పైన అవినీతి ఆరోపణలు నిరూపించాలని, అప్పుడు జైలుకెళ్తానని చెప్పారు.
నారా లోకేష్ పైన వైసిపి నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారంటూ రోజా మంగళవారం కూడా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో లోకేష్ ఈ రోజు స్పందించారు.
విజయవాడలో ముస్లీంలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. లోకేష్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, ముస్లీంలకు రిజర్వేషన్ సాధించి తీరుతామని చెప్పారు.

వైసిపి సంక్షేమ పథకాలను అడ్డుకుంటోందన్నారు. కులం, ప్రాంతం పేరుతో ప్రతిపక్షాలు చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలని హితవు పలికారు. ముస్లీం సోదరుల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.
అదే సమయంలో తన పైన వచ్చిన అవినీతి ఆరోపణలపై మాట్లాడుతూ.. దమ్ముంటే రుజువు చేయాలన్నారు. టిడిపిని దెబ్బతీయాలని విపక్షాలు చూస్తున్నాయన్నారు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలకు మిగులు బడ్జెట్ ఉందని, ఏపీకి మాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు లేవన్నారు.
అందుకే 20 మంది టిడిపిలోకి
హైదరాబాద్ నుంచి ఏపీకి ఉద్యోగులు తరలి రావడం సంతోషంగా ఉందని లోకేష్ అన్నారు. రికార్డ్ సమయంలో పట్టిసీమ, వెలగపూడి సచవాలయం నిర్మించామన్నారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణం కూడా అంతే వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.
కావాలనే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని రాద్దాంతం చేస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందని, అందుకే ఇరవై మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి టిడిపిలో చేరారని చెప్పారు.
పారదర్శకంగా పని చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే ప్రజలు సహించరన్నారు. రాజకీయ పరిపాలనతో అభివృద్ధి సాధ్యమని నిరూపించామన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా 33 వేల ఎకరాలు సేకరించామన్నారు.
కాగా, విజయవాడ పంజా సెంటర్‌లో బుధవారం పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ రంజాన్ తోఫా సరకుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
నారా లోకేశ్‌తో పాటు ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నగర మేయర్ కోనేరు శ్రీధర్, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. జలీల్ ఖాన్ కొద్ది రోజుల క్రితం వైసిపి నుంచి టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
-
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్ -
పేటీఎం బ్యాచ్‌తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications