లోకేష్ యాత్ర కొత్త "టర్న్" - చంద్రబాబు వ్యూహాం: రంగంలోకి బాలయ్య - నందమూరి ఫ్యామిలీ..!!
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తొలి అడుగు కుప్పం నుంచి ప్రారంభం కానుంది. భారీ సభకు రంగం సిద్దమైంది.
నారా లోకేశ్ పాదయాత్రకు రంగం సిద్దమైంది. పార్టీకి కంచుకోటగా నిలిచిన కుప్పం నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 రోజుల పాటుగా నాలుగు వేల కిలో మీటర్ల యాత్ర చేసేందుకు లోకేశ్ రూట్ మ్యాప్ ఖరారైంది. కుప్పం నుంచి ప్రారంభిస్తున్న యాత్ర ను ప్రతీ నియోజకవర్గంలో సక్సెస్ చేసేందుకు టీడీపీ నేతలు సిద్దమయ్యారు. తొలి రోజున భారీ సభకు ప్లాన్ చేసారు. ఈ సభకు చంద్రబాబు మినహా పార్టీ నేతలంతా హాజరు కానున్నారు.
లోకేశ్ యాత్ర ఆరంభంతో పాటుగా సభలోనూ బాలయ్య ప్రత్యేక బాధ్యతలు తీసుకోనున్నారు. మొత్తం టీడీపీ శ్రేణులంతా కుప్పంకు కదలి వచ్చారు. నందమూరి కుటుంబ సభ్యులు కుప్పంకు చేరుకున్నారు. లోకేశ్ యాత్ర పార్టీకి..వ్యక్తిగతంగా యువనేత రాజకీయ భవిష్యత్ కు ఎన్నికల వేళ కొత్త టర్నింగ్ గా మారనుంది.

కుప్పం నుంచి ప్రారంభం..
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత కుప్పంకు చేరుకున్న లోకేశ్ కు స్థానికంగా ఘన స్వాగతం లభించింది. ఈ రోజు కుప్పంలోని వరదరాజ స్వామి ఆలయం వద్ద పూజలు చేసి సరిగ్గా 11.03 గంటలకు లోకేశ్ తన యాత్రలో తొలి అడుగు వేయనున్నారు.
రాజకీయంగా తన తండ్రికి తొలి నుంచి అండగా ఉంటూ.. కలిసి వచ్చిన కుప్పం నుంచే లోకేశ్ తన రాజకీయ కెరీర్ లో కీలకం కాబోతున్న యాత్రను ప్రారంభిస్తున్నారు. నేడు ప్రారంభం కానున్న యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 400 రోజులు కొనసాగనుంది. నాలుగు వేల కిలో మీటర్ల మేర యాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేసారు. మధ్నాహ్నం భారీ సభ నిర్వహించనున్నారు.

కుప్పంకు బాలయ్య - నందమూరి ఫ్యామిలీ
లోకేశ్ యాత్ర ప్రారంభం వేళ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలంతా కుప్పం చేరుకున్నారు. అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్ లు కుప్పంలో జరిగే సభలో పాల్గొంటారు. పార్టీ అనుబంధ సంఘాలు హాజరు కానున్నాయి. అదే సమయంలో చంద్రబాబు మినహా పార్టీ నేతలంతా సభకు హాజరు కానున్నారు. లోకేశ్ యాత్ర ప్రారంభం వేళ అత్తా మామతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు.
హైదరాబాద్ లో ఇంటి వద్ద లోకేశ్ యాత్రకు బయల్దేరే వేళ..కుటుంబ సభ్యులంతా కలిసి లోకేశ్ యాత్ర సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఆ సమయంలో ఉద్విగ్న వాతావరణం కనిపించింది. యాత్ర సక్సెస్ కోసం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలకు పక్కా మ్యాప్ ఇచ్చారు. కుప్పంలో యాత్ర ప్రారంభ సమయంలో బాలయ్య కీలకంగా వ్యవహరించనున్నారు.

లోకేశ్ కెరీర్ లో టర్నింగ్ - చంద్రబాబు వ్యూహాలు
లోకేశ్ పొలిటికల్ కెరీర్ లో ఇప్పటి వరకు ఒక ఎత్తు..ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్లుగా యాత్రకు ప్రణాళికలు సిద్దం అయ్యాయి. ఇందుకోసం చంద్రబాబు కీలక వ్యూహాలు సిద్దం చేసారు. గతంలో తాను చేసిన యాత్రకు భిన్నంగా.. ప్రజలతో మరింత మమేకం అయ్యేలా లోకేశ్ యాత్రను సిద్దం చేసారు. పార్టీ శ్రేణులతో పాటుగా.. ప్రజలతో ఆప్యాయంగా దగ్గరయ్యేలా లోకేశ్ ఈ యాత్రను సద్వినియోగం చేసుకోనున్నారు.
పార్టీలో యువ నేతలతో సఖ్యతగా ఉంటున్న లోకేశ్..ఈ యాత్ర ద్వారా సీనియర్లతోనూ మమేకం కానున్నారు. పార్టీ క్షేత్ర స్థాయి పరిస్థితులతో పాటుగా.. ప్రజల్లో నిరంతరం ఉండటం ద్వారా మరింత సక్సెస్ ఫుల్ లీడర్ గా ఈ యాత్ర తీర్చి దిద్దుతుందని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా.. ఎన్నికల వేళ లోకేశ్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications