భవిష్యత్తు సిఎం నారా లోకేష్: మంత్రి పుల్లారావు

ఎట్టి పరిస్థితిలోనూ రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పడానికి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు - ముఖ్యమంత్రి పదవికి కావాల్సిన అర్హతలు లోకేష్‌కు ఉన్నాయని అన్నారు.
ప్రభుత్వం రైతులకు సెక్యూరిటీ బాండ్స్ ఇస్తుందని, వచ్చే 10, 15 ఏళ్లలో రుణాలు తిరిగి చెల్లించడానికి అవసరమైన మార్గాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. తమ తెలుగుదేశం పార్టీ మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడి తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని, అందుకే రైతుల రుణ మాఫీని అమలు చేస్తామని తాము హామీ ఇస్తున్నామని మంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications