ఎన్టీఆర్‌ని అడగాలని లేదు, బాబుని నిలదీయండి: లోకేష్

హైదరాబాద్/విజయవాడ: హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆదివారం స్పందించారు. ఓ టీవి ఛానల్‌తో ఆయన మాట్లాడారు. పార్టీ తరఫున ప్రచారం చేయాలని బాలకృష్ణ సహా తాము ఎవరినీ కోరలేదని చెప్పారు.

ఎవరికి వారే పార్టీ తమదిగా భావించి ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్‌ను టిడిపి కోసం ప్రచారం చేయాలని ప్రత్యేకంగా కోరాల్సిన అవసరం లేదన్నారు. సీమాంధ్రను సింగపూర్‌లా చేయకపోతే చంద్రబాబును నిలదీయాలన్నారు. అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ క్యాంటిన్లను ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తామన్నారు.

Nara Lokesh responds on Jr NTR

కెసిఆర్ పైన పొన్నాల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ఉద్యమ ద్రోహి అని తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కరీంనగర్లో సోనియా గాంధీ సభకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తాము తెరాస మేనిఫెస్టోను కాపీ చేశామనడం సరికాదన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. కెసిఆర్ ఓ పిల్లకాకి అన్నారు.

తెలంగాణకు అడ్డుపడిన వారిని, తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని టిక్కెట్లు ఇచ్చారన్నారు. కెసిఆర్ తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఒక్క పథకం గురించి అయినా మాట్లాడారా అన్నారు. ఈ నెల 16న కరీంనగర్లోని సభకు సోనియా వస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+