ఓటేసిన వారిని కాటేస్తున్నారు.. మరో దళితుడి మృతి... నారా లోకేశ్ ఫైర్
జగన్ సర్కార్ నారా లోకేశ్ ఒంటికాలిపై లేచారు. ఓటేసిన వారిని కూడా వదలడం లేదు అని మండిపడ్డారు. ఓటేసిన వారిని కాటేస్తున్నారని ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ దళిత యువకుడు చేసిన తప్పేంటీ అని అడిగారు. అతని ప్రాణం పోయేందుకు ప్రభుత్వమే కారణం అని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పనిచేయించుకొని.. తర్వాత ప్రాణం తీశారా అంటూ దుయ్యబట్టారు.
ప్రతాప్ అనే దళిత యువకుడు ఎన్నికలకు ముందు వైసీపీ కోసం పనిచేశాడు. అయితే జగన్ అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలపై నిలదీయడం ప్రారంభించాడు. ముఖ్యంగా మద్యపాన నిషేధంతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పోస్ట్ చేశారు. తర్వాత నుంచి అతనికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. నేతలు, పోలీసులు వేధించడం ప్రారంభించారు.
చంపేస్తాం అంటూ వైకాపా నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామంలో ఓం ప్రతాప్ చనిపోయాడు.ఓం ప్రతాప్ మృతి పై విచారణ చేపట్టాలి.(2/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 26, 2020
ఓటేసిన వారినే కాటేస్తున్నారు @ysjagan. మద్యపాన నిషేధం పేరుతో వైఎస్సార్సిపి ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రతాప్ ని బలితీసుకున్నారు.(1/3) pic.twitter.com/vwKVP4xUA9
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 26, 2020

సూటి పోటి మాటలతో ప్రతాప్ విసిగిపోయాడు. చిత్తూరు జిల్లా సోమాల మండలం కందూరులో విగతజీవిగా కనిపించాడు. అతను ఎలా చనిపోయారో అనే అంశంపై స్పష్టత లేదు. అయితే వైసీపీ నేతల వేధింపులతోనే చనిపోయారని లోకేశ్ ఆరోపించారు. ప్రతాప్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతాప్ హత్య వెనక ఉన్న వైసీపీ నేతలను శిక్షించాలని లోకేశ్ కోరారు. జగన్ రెడ్డి రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా అని లోకేశ్ ప్రశ్నించారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications