టిలో అందరికీ సమాన హోదా: గవర్నర్, బిజెపి ఆందోళన

Narasimhan speech in Telangana Assembly
హైదరాబాద్: తెలంగాణలో నివసించే ప్రతి పౌరుడికి సమాన హోదా కల్పిస్తామని గవర్నర్ నరసింహన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు. గవర్నర్ బుధవారం ఉదయం అసెంబ్లీకి చేరుకోగానే... శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి డిప్యూటీ ఛైర్మన్ విద్యాసాగర్ స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ఆరంభించి, ఇంగ్లీషులో కొనసాగించి, తెలుగులో ముగించారు.

ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, అమరవీరుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. దళితల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాజకీయ అవినీతిని నిర్మూలిస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి యాభై వేల కోట్లు కేటాయిస్తామన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైల్వే శాఖను సంప్రదిస్తామన్నారు.

ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా విద్యావిధానం ఉంటుందన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10 కోట్లు ఇస్తామన్నారు. ఇల్లు లేని వారికి ఇళ్లు, భూమి లేని వారికి భూమి ఇస్తామని చెప్పారు. అభివృద్ధి అజెండాగా పని చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంకులకు పింఛన్ వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు.

కెజి నండి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్య ఉంటుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణలో నివసించే ప్రతి ఒక్కరికి సమాన హోదా ఇస్తామన్నారు. చెరువులను అనుసంధానం చేస్తామని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామన్నారు. వరంగల్, సిరిసిల్లలో చేనేత పారిశ్రామికవాడల అభివృద్ధి చేస్తామన్నారు.

శాటిలైట్ టౌన్ షిప్‌ల ఏర్పాటు ద్వారా మురికివాడలు లేని హైదరాబాదును తీర్చిదిద్దుతామన్నారు. దేశీయ విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు. హైదరాబాదులో ఫార్మా, బయోటిక్ రంగాలకు పెద్ద పీట వేస్తామన్నారు. వ్యవసాయ ట్రాకర్లు, ట్రాలీలకు పన్ను మినహాయిస్తామన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ నివారిస్తామన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చుతామని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామన్నారు.

హైదరాబాదు నగరాన్ని ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా మార్చుతామన్నారు. స్లమ్ లెస్ సిటీగా మార్చుతామన్నారు. తెలంగాణలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రం విద్యుత్ కొరత ఎదుర్కొంటుందని, ఎన్టీపీసితో దానిని అధిగమిస్తామన్నారు. చత్తీస్ గఢ్ నుండి కొంటామన్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగు పరుస్తామన్నారు. కాగా గవర్నర్ తన ప్రసంగంలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

రుణమాఫీపై లేని స్పష్టత

గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ పైన స్పష్టత ఇవ్వలేదంటూ బిజెపి సభ్యులు నిరసన తెలిపారు. రుణమాఫీపై కాల పరిమితి ఉండవద్దని, షరతులు విధించవద్దని వారు డిమాండ్ చేశారు. బిజెపి సభ్యులకు కాంగ్రెసు, టిడిపి సభ్యులు కూడా జత కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+