క్యాంప్ రాజకీయాలు: రంగంలోకి జగన్, ఎమ్మెల్యే వర్సెస్ మాజీ?
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. టిడిపి - వైసీపీలు తమ సభ్యులను క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తోంది. నెల్లూరు వైసిపిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
నెల్లూరు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. టిడిపి - వైసీపీలు తమ సభ్యులను క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తోంది. నెల్లూరు వైసిపిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఓ వైపు జగన్ ఫోన్ల ద్వారా పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తుండగా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి తీరుతో ఆగ్రహించిన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు క్యాంపులకు వెళ్లమని భీష్మించారు. తొలినుంచి ఎమ్మెల్యే రామిరెడ్డి వ్యవహారశైలిపై స్థానిక కేడర్ గుర్రుగా ఉంటోందంటున్నారు.
విష్ణువర్ధన్ రెడ్డితో ఎమ్మెల్యే సఖ్యతగా మెలగడం లేదని, పార్టీ కార్యక్రమాలు, ఇతరత్రా వాటికి విష్ణువర్ధన్ రెడ్డిని ఆహ్వానించకపోవడంతో ఆయన కూడా అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారంటున్నారు.

ఇటీవల మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వంటేరు కూడా ఎమ్మెల్యేతో అంతగా కలిసి పని చేయలేక విష్ణువర్ధన్ రెడ్డితో కలిశారు. విష్ణువర్ధనరెడ్డికి మొదటి నుంచి నియోజకవర్గంలో పట్టు ఉంది.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లూరు, బోగోలులో అత్యధికంగా విష్ణువర్ధన్ రెడ్డి వర్గం ఎంపీటీసీలు గెలుపొందారు. అల్లూరులో విష్ణువ ర్ధన్ రెడ్డికి చెందిన మహిళ ఎంపీపీగా కొనసాగుతూ రెండున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యే మద్దతుదారులకు ఆ పదవి ఇవ్వాల్సి ఉంది.
అదే విధంగా బోగోలులో ఎమ్మెల్యే మద్దతుతో ఉన్న ఎంపీటీసీ పర్రి సులోచనమ్మ ఎంపీపీగా కొనసాగుతుండగా, రెండేళ్లు గడి చాక విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీటీసీ పచ్చ విజయమ్మ ఎంపీపీ కావాల్సి ఉన్నా, అలా జరగలేదు. ఇందుకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలే కారణమంటున్నారు.
కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యం సాధించిన వైసిపి తొలుత యానాదిశెట్టి తనయ అలేఖ్యకు చైర్మన పదవి ఇవ్వాలని భావించింది. తీరా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే జోక్యంతో శ్రీలతను తెరపైకి తీసుకురావడంతో యానాది శెట్టి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అదొక వివాదంగా కొద్ది రోజులు నడించింది. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరంతా ఓటర్లు. వీరందరిని క్యాంపులకు తరలించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
అల్లూరు, బోగోలు మండలాల్లో ఎంపీటీసీలు తాము విష్ణువర్ధన్ రెడ్డి చెప్పేంత వరకు కదలమని తేల్చి చెప్పారు. రెండు రోజుల క్రితం విష్ణువర్ధన్ రెడ్డి కావలికి వచ్చి కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
శనివారం ఉదయం కావలిలో కౌన్సిలర్లతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. తామే విష్ణువర్ధన్ రెడ్డిని కలిసినట్లు పలువురు కౌన్సెలర్లు చెప్పారు. ఈ వారు క్యాంపుకు వచ్చేందుకు ససేమీరా అన్నారు.












Click it and Unblock the Notifications