ఢిల్లీలో ఏపీ గవర్నర్- రాష్ట్రపతితో భేటీ: రేపు ప్రధానితో సమావేశం..!!
ఏపీ గవర్నర్ గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన సయ్యద్ అబ్దుల్ నజీర్.. ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.
అమరావతి: ఏపీ గవర్నర్ గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన సయ్యద్ అబ్దుల్ నజీర్.. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండురోజుల పర్యటన కోసం ఆయన ఇవ్వాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తన పర్యటన సందర్భంగా కొందరు కేంద్రమంత్రులను కలిశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ కు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కాబోతోన్నారు.
గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే ఆయన హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యాహ్నం గవర్నర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ అదనపు కమిషనర్ హిమాన్షు కౌశిక్ స్వాగతం పలికారు.

ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. అనంతరం ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ ను కలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోనున్నారు. ఆ తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ ఆయన సమావేశం కానున్నారు. గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం చర్చనీయాంశమైంది. మర్యాదపూరకంగా ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుసుకోనున్నారు.

శుక్రవారం అబ్దుల్ నజీర్ రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. ఇదివరకు ఏపీ గవర్నర్ గా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ ను కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications