జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారయత్నం: చిత్రపరిశ్రమ వ్యక్తే

సమాచారం మేరకు.. ఈ సంఘటన జూబ్లీహిల్స్ రెహమత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు నిందితుడి పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారని సమాచారం. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బస్సు, లారీ ఢీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని వెంకటరావుపల్లి వద్ద ముంబై రహదారి పైన ఆర్టీసి బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో పదిహేనుమందికి స్వల్ప గాయాలయ్యాయి.
అగ్ని ప్రమాదం
హెచ్‌విసి ప్రాంతంలోని సమష్టి అతిథి గృహంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్థులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంతో ఫర్నీచర్ దగ్ధమైంది.












Click it and Unblock the Notifications