తెలంగాణ తథ్యం, పరిష్కరిస్తాం: మళ్లీ తేల్చి చెప్పిన షిండే

Sushil Kumar Shinde
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం చెప్పారు. రాష్ట్ర విభజన ద్వారా వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కాగా, ఇటీవల ఢిల్లీ నేతలు విభజన అనివార్యమని పలుమార్లు కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్న విషయం తెలిసిందే.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సుశీల్ కుమార్ షిండే సోమవారం సాయంత్రం ఐదు గంటలకు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులపై చర్చించనున్నారు. విభజన నిర్ణయం తదనంతర పరిణామాలు వారి మధ్య చర్చకు రానున్నాయి.

గడపగడపకు కాంగ్రెసు

తెలంగాణకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుకూలంగా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు గడపగడపకు కాంగ్రెసు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని బోదన్, నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టలో మొదటి విడతగా సభలు పెట్టాలని భావిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జానా రెడ్డి నివాసంలో తెలంగాణ నేతలు భేటీ కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+