చంద్రబాబుకు దక్కని ఢిల్లీ ఓదార్పు, ఏ ఒక్కరూ - తెర వెనుక..!!

45 ఏళ్ల రాజకీయ జీవితం. రాష్ట్ర..జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. ఇప్పుడు అనూహ్య పరిస్థితుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం..జాతీయ స్థాయిలోనూ ప్రముఖ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న చంద్రబాబు గురించి ఏ ఒక్క నేత స్పందించలేదు. కూటమలు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబుకు నేడు ఓదార్పు కరువైంది. ఎందుకిలా..అసలు ఢిల్లీ కేంద్రంగా ఏం జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం
చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ పైన పవన్ స్పందించారు. మద్దతు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. ఆ తరువాత స్పందించలేదు. ఇక, వామపక్షాల నేతలు చంద్రబాబు బాసటగా నిలిచారు. బీజేపీ తీరు గుర్తించాలని సూచించారు.

Chandrababus

అసలు కేంద్రంలోని ముఖ్యుల మద్దతు లేకుండా చంద్రబాబు అరెస్ట్ జరిగేనా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏపీ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా తొమ్మిదేళ్లు..విభజిత ఏపీ సీఎంగా అయిదేళ్లు పాలించారు. నాడు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, వాజ్ పేయ్ హయాంలో ఎన్డీఏలోనూ కీలకంగా పని చేసారు. పలు పార్టీలకు ఒకే వేదిక మీదకు తీసుకొచ్చారు. ఫ్రంట్ కన్వీనర్ గానూ వ్యవహరించారు. 2014లో ఎన్డీఏలో ప్రధాని మోదీతో కలిసి పని చేసారు.

నాడు కేంద్రంలో కీలకంగా
కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పారని ఇప్పటికీ టీడీపీ నేతలు పదే పదే చెబుతూ ఉంటారు. 2018లో నాటి కారణాలతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కానీ, 2019 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ఓడిపోవటంతో పాటుగా..కేంద్రంలో మోదీ మరోసారి అధికారంలోకి వచ్చారు.

అక్కడే చంద్రబాబు రాజకీయం పూర్తిగా రివర్స్ అయింది. అప్పటి నుంచి సమయం వచ్చినప్పుడల్లా మోదీ నిర్ణయాలకు మద్దతు ఇవ్వటం...అసవరమైన సందర్భాల్లో బిల్లులకు సపోర్ట్ చేయటం మినహా ప్రత్యేకంగా గుర్తింపు లేదు. అదే సమయంలో కేంద్రంలోని ముఖ్యులతో సీఎం జగన్ సన్నిహితమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆ స్నేహం తమ గెలుపుకు నష్టం చేయకుండా తిరిగి బీజేపీతో దగ్గరయ్యేందకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

స్పందించని ఢిల్లీ నేతలు
ఇటు పవన్ సైతం బీజేపీ, చంద్రబాబు మద్య గ్యాప్ తగ్గించేందుకు కష్టపడుతున్నారు. కానీ, బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఆశించిన స్పందన లేదు. ఈ పొత్తుల ఆశల సమయంలోనే అనూహ్యంగా సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. కేంద్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమిలకు చెందిన ఏ ఒక్క నేత చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించలేదు.

మమతా, నితీశ్, ఫరూక్ అబ్దుల్లా, సీతారం ఏచూరీ, పవార్, అఖిలేష్, కేజ్రీవాల్ సహా ఏ ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించలేదు. కనీస ఓదార్పు ఇవ్వలేదు. ఎన్డీఏలో పవన్ భాగస్వామిగా ఉంటూ జగన్ పై పోరాటం చేస్తున్నారు. అటు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా జగన్ కు ప్రాధాన్యత దక్కటం లేదు. దీంతో, ఢిల్లీలో నాడు చక్రం తిప్పిన చంద్రబాబు అరెస్ట్ అయితే, ఇప్పుడు కనీస పరామర్శలు లేకపోవటం రాజకీయంగా ఆసక్తి కర చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+