నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరు జిల్లాలో బయటపడ్డ 445ఏళ్ల నాటి రాతి శాసనం..

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చేడిమాలలో 1572 నాటి తెలుగు శాసనం ఒకటి బయటపడింది. భారత పురావస్తుశాఖ అధికారి ఎం.యేసుబాబు, వెంకటగిరికి చెందిన చరిత్రకారుడు షేక్‌ రసూల్‌ అహ్మద్‌ దీన్ని గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

వెంకటగిరి: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చేడిమాలలో 1572 నాటి తెలుగు శాసనం ఒకటి బయటపడింది. భారత పురావస్తుశాఖ అధికారి ఎం.యేసుబాబు, వెంకటగిరికి చెందిన చరిత్రకారుడు షేక్‌ రసూల్‌ అహ్మద్‌ దీన్ని గుర్తించారు.

గత వారం రోజులుగా తాము జిల్లాలో చరిత్ర మూలాలపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో చిల్లకూరు మండలం చేడిమాలలో పురాతన ఈశ్వరాలయం వెనుక భాగంలో ముళ్ల పొదల మధ్య రాతి శాసనం బయటపడిందని తెలియజేశారు.

old inscription found in nellore

ఈశ్వారాలయం వెనుక బయటపడ్డ ఈ పురాశాసనం 6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పుతో 21 వరుసలు ఉందన్నారు. చేడిమాల చెరువుకు సంబంధించిన శాసనంగా దీన్ని గుర్తించారు. శాలివాహన శకర్షము, జయ సంవత్సరంలో రాజైన ముద్దుకృష్ణమనాయునికి పుణ్యముగా కొప్పూరి వీరమురసయ్య చేడిమాలలో చెరువును తవ్వించిన సందర్భంలో ఈ శాసనం చేయించినట్టు చెబుతున్నారు.

ఆ సమయంలో మాన్యాలను కేటాయిస్తూ గ్రామ అధికారి పర్యవేక్షణలో చెరువును తవ్వించినట్టుగా పురావస్తు అధికారి యేసుబాబు వివరించారు. దుగరాజపట్నం, వెంకటగిరి ప్రాంతాలకు అప్పట్లో ఈ పట్టణమే కూడలిగా వర్దిల్లిందని, ఇక్కడ ప్రాచీన కట్టడాలను చూస్తే ఆ విషయం అర్థమవుతోందని అన్నారు.

English summary
An old inscription was found on Thursday in Chillakuru, Nellore district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X