తెలంగాణ సచివాలయం తరలింపు: ఆన్‌లైన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇ-పిటిషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఎర్రగడ్డలోని టెస్ట్ ఆసుపత్రి ప్రాంగణానికి తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. రామ్ మోహన్ రెడ్డి ఆన్ లైన్‌లో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇ-పిటిషన్‌ను ప్రారంభించారు.
మంగళవారం ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి తన ఆఫీసులో ఇందుకు సంబంధించిన విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘www.change.org' వెబ్‌సైట్‌లో ఇ-పిటిషన్‌ను ఉంచినట్లు తెలిపారు. ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్‌కు ఈ-పిటిషన్ చేశారు.
ఇ-పిటిషన్‌లో చెస్ట్ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌కు, తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రికి తరిలిచండాన్ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మోనార్క్‌లాగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, కాబట్టి ఈ తరలింపుని అడ్డుకునేందుకు అందరూ మద్దతుగా నిలబడాలని ఆయన అన్నారు.
ఈ-పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి













Click it and Unblock the Notifications