వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జయ'తో చిల్లర వద్దు: టీడీపీకి పార్థసారథి కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parthasarathi counter to TDP leaders comments
విజయవాడ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు పడిన శిక్ష తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పడుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు అనడం హాస్యాస్పదమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి పార్థసారథి సోమవారం అన్నారు.

రాజ్యాంగపరమైన పదవులను జగన్ అనుభవించలేదన్నారు. టీడీపీ నాయకులు జగన్ పైన అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. చిల్లర వ్యవహారాలు పక్కన పెట్టి ప్రజలకు సరైన పాలన అందించాలని హితవు పలికారు. ఐఎంజీ తదితర కేసుల్లో ప్రాథమిక ఆధారాలతో విజయమ్మ కోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు భయపడి కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని, దర్యాఫ్తు సంస్థలతో దర్యాఫ్తు చేయించుకొని ఎందుకు క్లీన్ చిట్ తెచ్చుకోలేదని ప్రశ్నించారు.

అవినీతికి తావులేకుండా చూస్తాం: దేవినేని

కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల్లో అవినీతికి తావులేకుండా చేస్తామని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గుంటరు జిల్లాలో అన్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పైన వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం పనులు చేపడుతుందన్నారు.

English summary

 Parthasarathi counters TDP leaders comments on YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X