కొత్త లైన్ మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు, షెడ్యూల్ - కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఇక ఇలా..!!
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింది. నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు నేడు (శుక్రవారం) పట్టాలెక్కనుంది. న్యూ పిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య 46 కి.మీ. దూరం నూతన రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం నుంచి తిరుపతికి రైలును నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మీదుగా దక్షిణాది నగరాలకు ఈ మార్గం ద్వారా అనుసంధానం ఏర్పడింది. ఇక, తిరుపతి ప్రయాణీకుల కోసం కృష్ణా ఎక్స్‌ప్రెస్ లో స్లీపర్ కోచ్ లను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
కొత్త మార్గం ప్రారంభం
అమరావతిలో కీలకమైన నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు మార్గంలో న్యూ పిడుగురాళ్ల - శావల్యాపురం మధ్య తొలిసారి ప్రయాణికుల రైలు పరుగులు పెట్టనుంది. ఈ రైలు మార్గం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు గూడ్స్ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. ఇక, జూలై 4వ తేదీ నుంచి ప్రయాణీకుల రైళ్లు పట్టాలెక్కనున్నాయి. తొలిగా నాందేడ్ నుంచి తిరుపతి వెళ్లే ప్రత్యేక రైలును ఈ మార్గం నుంచి నడపాలని అధికారులు నిర్ణయించారు. జులై 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఈ రైలు నడవనుంది.

ప్రత్యేక రైలు
జూలై 4వ తేదీ మహారాష్ట్ర నాందేడ్‌లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07189) పల్నాడు జిల్లాలో నడికుడికి రాత్రి 12.05, పిడుగురాళ్లకి రాత్రి 12.30, నెమలపురికి రాత్రి 01.00, రొంపిచర్లకి రాత్రి 01.25, వినుకొండకు 02.00 గంటలకు చేరుతుంది. మార్కాపురం, దొనకొండ, కంభం, నంద్యాల మీదుగా తిరుపతికి శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రైలు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07190) తిరుపతిలో జులై 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి వినుకొండకు రాత్రి 10.05కు, రొంపిచర్ల 10.25కు, నెమలిపురి 10.35కు, పిడుగురాళ్ల 10.45కు, నడికుడి 11.00కి, నాందేడ్‌కు ఆదివారం ఉదయం 09.30 గంటలకు చేరుతుంది.
కృష్ణా ఎక్స్‌ప్రెస్ లో ఇలా
ఇక, ఆదిలాబాద్ నుంచి తిరుపతిల మధ్య రాకపోకలు సాగించే కృష్ణా ఎక్స్‌ప్రెస్ (నం.17405, 17406)లో స్లీపర్ బోగీల సంఖ్య పెరగనుంది. సెకండ్ క్లాస్ ఛైర్‌కార్ బోగీలు తగ్గనున్నాయి. ఈ రైల్లో ప్రస్తుతం త్రీటైర్ ఏసీ నాలుగు, స్లీపర్ నాలుగు, సెకండ్ క్లాస్ ఛైర్ కార్ 10, జనరల్ సెకండ్ క్లాస్ నాలుగు బోగీలున్నాయి. జులై 6 నుంచి త్రీటైర్ ఏసీ మూడు, సెకండ్ క్లాస్ ఛైర్‌కార్ ఆరు బోగీలకు తగ్గి..స్లీపర్ బోగీలు ఎనిమిదికి పెరగనున్నాయి. ఈ నిర్ణయం సెప్టెంబరు 1 వరకు అమల్లో ఉంటుంది. సెప్టెంబరు 2 నుంచి జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు నాలుగుకు తగ్గుతాయి. స్లీపర్ బోగీలు 14కు పెరగనున్నాయి.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications