తుని ఘటన: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం?

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా తుని ఘటనపై జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సంచలన విషయం చెప్తాడని అంటున్నారు. ఆయన మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారనే విషయంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆయన సాయంత్రం 4గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడతారు. ఇప్పటికే పవన్ కాపు గర్జనలో అసలేం జరిగిందన్న విషయాలను పూర్తిగా తెలుసుకున్నారు. ఇంత హింసాత్మక ఘటన ఎలా జరిగింది..అసలు కారకులెవరిని పార్టీ నేతలు, తునిలో ఉన్న తన సన్నిహితులను పవన్ అడిగి తెలుసుకున్నారు.

Pawan kalyan may make important statement

శాంతియుతమైన వాతావరణాన్ని తునిలో కొనసాగించాలన్న విషయంపై పవన్ స్పష్టత ఇస్తారని అంటున్నారు. పోలీసులపై పవన్ స్పందిస్తారని చెబుతున్నారు. కాపు గర్జన విషయంపై పవన్ సంచలన నిర్ణయం తీసుకుంటారని పార్టీనేతలు చెబుతున్నారు.

అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు, పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడతారని తెలిసింది. షూటింగ్‌ను అపేసి పవన్ కల్యాణ్ కేరళ నుంచి హుటాహుటిన హైదరాబాద్ వచ్చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+