చిరంజీవిని కలిసిన పవన్ కల్యాణ్
మెగాస్టార్ చిరంజీవిని ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. దీనికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అలాగే పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. దీనికి దర్శకుడు క్రిష్. ఈ సినిమాను పాన్ ఇండియాస్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
వాల్తేరు వీరయ్య, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ పక్కపక్కనే జరుగుతున్నాయి. పవన్ వాల్తేరు వీరయ్య సెట్స్ కు వచ్చారు. సినిమా చిత్రీకరణలో ఉన్న చిరంజీవితోపాటు ఇతర చిత్ర బృందంతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చిరంజీవి త్వరలోనే విడుదల కాబోతున్న బాస్ పార్టీ పాటను పవన్ కు స్వయంగా చూపించారు. ఈ పాట పవన్ కు బాగా నచ్చిందని దర్శకుడు బాబీ చెప్పారు.

ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తోన్న హరిహర వీరమల్లు సినిమాను త్వరగా పూర్తిచేసి 2023 వేసవిలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. రోజురోజుకు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుండటం, తాను రాజీకయాల్లో బిజీగా ఉండటంతో చేయాల్సిన బస్సు యాత్రను కూడా వాయిదా వేసి హరిహర వీరమల్లుతోపాటు మరో సినిమాలను పూర్తిచేయాలనే నిర్ణయానికి పవన్ వచ్చారు.

ఈ రెండు సినిమాల తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ఎన్నికలైన తర్వాత చేద్దామని చెప్పారు.












Click it and Unblock the Notifications