వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్...నిజంగానే అజ్ఞాత వ్యక్తి... అంటున్నరాజధాని వైసిపి మద్దతుదారులు...

|
Google Oneindia TeluguNews

అమరావతి: పవన్ కళ్యాణ్...తన చర్యల ద్వారా తాను నిజంగానే అజ్ఞాత వ్యక్తి నని రుజువు చేసుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు వైసిపి మద్దతుదారులు. ఇప్పుడీ విమర్శ ఎందుకొచ్చిందంటే...

ఈ మధ్యనే హఠాత్తుగా రంగప్రవేశం చేసి నవ్యాంధ్ర అంతా కలేసి తిరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడెక్కడ అని ప్రశ్నిస్తున్నారు వైసిపి మద్దతుదారులు.నిన్నటిదాకా ఛలోరే ఛలోరే ఛల్ అంటూ 4 రోజులు అనేక అంశాల మీద ప్రశ్నించి హడావుడి చేసిన "అజ్ఞాత వ్యక్తి" పవన్ కళ్యాణ్ మళ్లీ అజ్ఞాతం లోకి వెళ్ళిపొయ్యడంటున్నారు.

 మళ్లీ ఎప్పుడొస్తారంటే...

మళ్లీ ఎప్పుడొస్తారంటే...

పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగానే ఇదంతా చేస్తున్నారనేది వైసిపి మద్దతుదారుల వాదన. అందుకే పవన్ మళ్లీ అజ్ఞాతం లోకి వెళ్లి పోయారని, చంద్రబాబుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ ఈ "అజ్ఞాత వ్యక్తి" కి ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శిస్తున్నారు.
అప్పుడు మళ్ళీ 4 రోజులు ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతారు...బాబు అనుకూల మీడియా ఆ పర్యటనలను హైలెట్ చేస్తుంది...అప్పుడు కూడా ప్రతిపక్షాన్నే ప్రశ్నిస్తారు...మళ్ళీ వెళ్ళిపోతారని విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

 ఇప్పుడెందుకంటే...

ఇప్పుడెందుకంటే...

తాజాగా రాజధాని ప్రాంతంలో వెయ్యి ఎకరాల ఫై చిలుకు భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన వైసిపి నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలతో దండెత్తుతున్నారు. అజ్ఞాత వ్యక్తి ఎక్కడున్నారో రావాలని ఎద్దేవా చేస్తున్నారు.

 ఒక్కసారి గుర్తు చేసుకోండి...

ఒక్కసారి గుర్తు చేసుకోండి...

అయ్యా అజ్ఞాత వ్యక్తీ గారు, మీరు ఎక్కడున్నారో తెలియదు గానీ, రాజధాని నిర్మాణం అనే సాకుతో రైతుల భూములను ఆక్రమించుకుంటున్న సందర్భంలో మీరు రాజధాని గ్రామాలలో పర్యటించారు. ఆ సందర్భంలో మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో జరిగిన సభలో మీరు మాట్లాడుతూ రాజధానికి రైతులు ఇష్ట పూర్వకంగా భూములు ఇస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదు, అలా చేస్తే రైతుల కోసం ఈ బేతపూడి గ్రామంలోనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని సెలవిచ్చారు.

 అజ్ఞాత వ్యక్తి కి విన్నపం...

అజ్ఞాత వ్యక్తి కి విన్నపం...

అయ్యా ఆజ్ఙాతవ్యక్తి గారు, రాజధాని ప్రాంతంలో వెయ్యి ఎకరాల ఫై చిలుకు,ప్రభుత్వం భూసేకరణకు నిన్న నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు ఎక్కడున్నారో, ఇది మీ దృష్టి కి వచ్చిందో లేదో, దయచేసి ఒక్క సారి పేపర్ చూడండి...మా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు రాజధానికి రండి...మీ రాక కోసం...మీరు చేసే ఆమరణ నిరాహార దీక్ష కోసం రాజధాని ప్రాంత రైతులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని విన్నవించుకుంటున్నామన్నారు.

English summary
Pawan who had returned to active politics with his recent political tour ‘Chalore Chalore Chal’, and slammed 3 parties for not fulfilling their role. But critic's says Pawan's criticism is mainly targeted on the ycp. The Pawan issue was again discussed in the backdrop of the of land acquisition notification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X