చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు - తాజా డిమాండ్..!!
కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలపైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పైన ప్రశ్నలు సంధించారు. ఉత్తర్వుల బూచి చూపించి ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటారా అని నిలదీసారు. ఈ ఉత్తర్వులు ప్రతిపక్షాలకే వర్తిస్తాయా..ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వర్తించవా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేలను జనంలో తిరగడానినకి అనుమతించకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరు అధికారంలో లేనప్పుడు ఒక రూలు, మీరు అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా అంటూ పవన్ కల్యాణ్ నిలదీసారు.
ప్రభుత్వం పైన పవన్ ఆగ్రహం
ప్రభుత్వం తాజాగా రోడ్ల పై సభలకు అనుమతి రద్దు చేస్తూ జారీ చేసిన జీవో పైన పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. ఓదార్పు యాత్ర పేరు మీద దశాబ్దం పాటు యాత్రలు చేయచ్చు, రోడ్ షోలు చేయచ్చు కాని; ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్షాలు - ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనంలో తిరగడానికి కూడా అనుమతించకపోతే ఎలా?? అంటూ నిలదీసారు. మీరు అధికారంలో లేనప్పడు ఒక రూలు, మీరు అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా?? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు వినిపించకూడదు.. ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించూడదనే ఈ జీవో తీసుకొచ్చారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

విశాఖలో చెప్పారు..ఇప్పుడు చేసారు
ఈ రకమైన జీవో ఉద్దేశాలను అక్టోబర్ లోనే వెల్లడించారన్నారు. వాహనంలో నుంచి బయటకు రాకూడదు, అభివాదం చేయకూడదు, హోటల్ నుంచి బయటకు రాకూడదు వంటి నిర్భందాలు విధించారన్నారు. ఇప్పుడు అక్షర రూపం ఇచ్చి జీవో విడుదల చేసారని పవన్ చెప్పుకొచ్చారు.కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవటం సరి కాదన్నారు. జీవో బూచి చూపించి చంద్రబాబును కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకోవటాన్ని ఖండిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాయన్నారు. కుప్పం ఎమ్మెల్యేగా తన ప్రజలను కలవటం ఆయన విధి అన్నారు. ఆయన విధులను ఈ జోవోతో అడ్డుకుంటున్నారా.. ఈ జోవో..ఉత్తర్వులు జగన్ రెడ్డికి వర్తిస్తాయా.. లేవా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ను అడ్డుకుంటారా
ఇలాంటి జీవోలు తీసుకొస్తే జగన్ రెడ్డి పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంంలో జనాన్ని రోడ్డుకు ఇరు వైపులా ఆయన చేసిన షో ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందా రారో పోలీసు అధికారులు వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేసారు. ఇలాంటి విధానాలను ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నించాలని పవన్ పిలుపునిచ్చారు. ఏపీలో టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమనే వార్తలు రెండు పార్టీ శ్రేణుల్లోనూ వినిపిస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయనే ఆరోపణలు చేస్తోంది. కానీ, పవన్ ఇప్పటి వరకు అధికారికంగా పొత్తు పైన ఎటువంటి ప్రకటన చేయలేదు. చంద్రబాబు ను కుప్పంలో అడ్డుకోవటం పైన పవన్ తాజా స్పందనతో వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ వుతారనేది చూడాలి.












Click it and Unblock the Notifications