దేశాభివృద్ధి కోసమే పవన్ మద్దతిచ్చారు: హరిబాబు
విజయవాడ: భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీలు భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికాయని ఆ పార్టీ విశాఖపట్నం ఎంపి కంభంపాటి హరిబాబు అన్నారు. ఆయన శుక్రవారం కృష్ణా జిల్లాలోని విజయవాడకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
దేశాభివృద్ధితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని నమ్మిన పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బిజెపికి ఇటీవలి ఎన్నికల్లో మద్దతు పలికారని చెప్పారు.

విజయవాడ-తెనాలి-గుంటూరు నగరాలకు కలుపుతూ మెట్రో రైలును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా మెట్రో రైలు అంశంపై ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే.
యుపిఏ ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు గత ఏడెనిమిదేళ్లుగా ముందుకు సాగలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ప్రాంతాలు లబ్ధి పొందుతాయని హరిబాబు అన్నారు. దేశ ఆర్థిక ప్రగతికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications