కుక్కలు అరిచినట్టు అరిస్తే.. పవన్ కల్యాణ్ సంచలన హెచ్చరిక

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న భారతావని ఆకాంక్ష నెరవేరింది. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ ను చేపట్టింది భారత ఆర్మీ. పాకిస్థాన్‌లోని 9 రహస్య ఉగ్ర స్థావరాలపై భారత్‌ మెరుపు దాడులు నిర్వహించింది. కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిర్వహించిన దాడుల్లో దాదాపు 70 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు. మరో 60 మంది గాయాలపాలైనట్లు పేర్కొంది. భారత ఆర్మీ నిర్వహించిన ఈ మెరుపు దాడుల్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మూసూద్ అజహర్ కుటుంబంలోని 14 మంది హతం అయ్యారు.

అయితే ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చివరి "ఉగ్రవాదిని ఏరివేసే వరకు "ఆపరేషన్ సిందూర్" కొనసాగాలి. భారత రక్షణ బలగాల వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పింది.

ఉగ్రవాదంపై పోరాటంలో గౌ. ప్రధాని శ్రీ @narendramodi గారు తీసుకునే నిర్ణయాలకు యావత్ జాతి మద్దతిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు. భారత సైన్యాన్ని కించపరచినా... దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం" అని పవన్ కల్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు.

Pawan Kalyan Warns Against Misleading Posts on Operation Sindoor

అంతకుముందు కూడా పవన్ కల్యాణ్.. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. "దశాబ్దాలుగా సహనం.. సహనం!.. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి "ఆపరేషన్ సింధూర్" తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని శ్రీ @narendramodi గారికి కృతజ్ఞతలు... మీ వెన్నంటే మేము. జైహింద్!.. అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+