తిరుమలలో పవన్ సతీమణి అన్నా లెజినోవా.. టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్!

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా రేపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమె తిరుమల శ్రీవారికి మొక్కు చెల్లించుకోనున్నారు. సింగపూర్లో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి అగ్ని ప్రమాదంలో గాయపడినా, ప్రాణాపాయం నుంచి బయటపడటంతో తిరుమల శ్రీవారిని కుటుంబంతో కలిసి దర్శించుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావించారు.

తిరుమలకు చేరుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా, పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.దీనికోసం ఇప్పటికే నేడు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అన్నా లెజినోవా, తిరుమలకు చేరుకుని ఈరోజు రాత్రి అక్కడే బస చేస్తున్నారు. అన్నా లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో అన్యమతస్తులు తిరుమలకు వెళితే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది.

Pawan Kalyan wife Anna Lezhinova gave declaration in the presence of TTD employees in Tirumala

డిక్లరేషన్ ఫాం పైన సంతకం చేసిన అన్నా లెజినోవా
ఈ క్రమంలోనే అన్నా లెజినోవా ఎటువంటి కాంట్రవర్సీ లకు తావివ్వకుండా గాయత్రి సదనం లో టిటిడి ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాల పైన సంతకం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లారు. అప్పుడు కూడా ఆయన కుమార్తెతో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయించారు.

రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న అన్నా
ప్రస్తుతం అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి పైన అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తూ డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేశారు. ఇక నేడు రాత్రి తిరుమలలో బస చేస్తున్న అన్నా లెజినోవా, తిరుమల శ్రీవారికి తలనీలాలను సమర్పించి శ్రీవారిని దర్శించుకుంటారు. మార్క్ శంకర్ తో పాటు కూతురుని కూడా తీసుకువెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారని సమాచారం.

తిరుమల శ్రీవారు గండం గట్టెక్కించారని మొక్కులు
అయితే అన్నా లెజినోవా తో పాటు పవన్ కళ్యాణ్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని మొదట ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం అన్నా లెజినోవా మాత్రమే తిరుమల స్వామి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. మొత్తానికి మార్క్ శంకర్ ను ప్రాణాపాయం నుండి కాపాడింది తిరుమల శ్రీవారు అని గట్టిగా నమ్ముతున్న పవన్ కళ్యాణ్ కుటుంబం రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+