27న బాలకృష్ణను కలవనున్న పవన్ కల్యాణ్
కథానాయకులు, రాజకీయ నాయకులైన బాలకృష్ణ, పవన్ కల్యాణ్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కథానాయకులుగా నటిస్తున్న వీరసింహారెడ్డి, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ పక్కపక్కనే జరుగుతుండటంతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అయితే ఈ ఇద్దరి భేటీలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్-2 షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ సినీ జవితాన్ని రెండుగా విభజిస్తే అన్ స్టాపబుల్ కు ముందు బాలకృష్ణ, అన్ స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ అన్నట్లుగా విపరీతమైన ప్రజాదరణ పొందారు. ప్రస్తుత యువతరాన్ని కూడా ఈ కార్యక్రమంద్వారా ఆకట్టుకున్నారు. అలాగే పవన్ కల్యాణ్ పవర్ స్టార్. సరైన సినిమా ఒకటి పడినరోజున అతణ్ని ఆపేవారే ఉండరు. ఈ ఇద్దరిలో ఒక విషయం కామన్ గా ఉంటుంది. అదేమిటంటే కల్మషం లేకుండా మాట్లాడతారు అని. అటువంటి మనస్తత్వాలున్న వీరిద్దరూ కలిసి షో చేయబోతున్నారు అన్ స్టాపబుల్ షోకి పవన్ కల్యాణ్ రానున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఈనెల 27వ తేదీన జరగనుంది.

వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ చేస్తున్న షోపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కొనసాగుతోంది. బాలకృష్ణ ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు? పవన్ ఏం సమాధానాలు చెబుతారనే ఉత్కంఠ ఇద్దరి కథానాయకుల అభిమానుల్లో చోటుచేసుకుంటోంది. రాజకీయ పరమైన అంశాలు ఏవి చర్చకు వస్తాయనేది షో పూర్తయిన తర్వాతే తేలనుంది. ఏదేమైనప్పటికీ ఇద్దరూ కలిసి సినిమాలో నటించకపోయినప్పటికీ షోలో కలవడంద్వారా అభిమానులకు ముందే సంక్రాంతి పండగ వచ్చినట్లుగా ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యాఖ్యానించాయి.












Click it and Unblock the Notifications